నానితో సుజిత్ సినిమా ఇలా!
మరి ఈ సినిమా జానర్ ఏంటి? అంటే `రన్ రాజా రన్` లా ఈ సినిమా ఉంటుందని సుజిత్ క్లారిటీ ఇచ్చాడు.;
పదేళ్ల కెరీర్ లో యువ సంచలనం సుజిత్ చేసింది మూడు సినిమాలే. తొలి సినిమా `రన్ రాజా రన్` కామెడీ జానర్ లో తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఆ వెంటనే ప్రభాస్ ని బుట్టలో వేసి `సాహో` అనే యాక్షన్ థ్రిల్లర్ చేసాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ లాంచ్ అయ్యాడు. ప్రభాస్ తో `సాహో` ఎలా తీస్తాడో? అనే టెన్షన్ అభిమానుల్లో ఉండేది. దర్శకుడిగా చేసింది ఒక్క సినిమానే . పెద్దగా అనుభవం కూడా లేని నేపథ్యంలో ప్రభాస్ ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకుంటున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ డార్లింగ్ ని బాలీవుడ్ లో పర్పెక్ట్ గా లాంచ్ చేసి ప్రశంసలందుకున్నాడు.
యాక్షన్ టూ కామెడీ:
తెలుగు ఆడియన్స్ కి సాహో కనెక్ట్ కానప్పటికీ బాలీవుడ్ లో మంచి వసూళ్లనే సాధించింది. సుజిత్ లో ఇంత స్టైలిష్ క్రియేటర్ ఉన్నాడా? అన్నంత గొప్పగా సినిమా చేసాడు. ఆ నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ కూడా `ఓజీ`కి అవకాశం ఇచ్చాడు. ఇది గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో సాగిన స్టోరీ. ఇలా యాక్షన్ బాట పట్టిన యంగ్ డైరెక్టర్ మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్తున్నాడా? అంటే అవుననే అంటున్నాడు సుజిత్. నేచురల్ స్టార్ నానితో సుజిత్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. `బ్లడీ రోమియో` అనే టైటిల్ తో ఈ సినిమా చేస్తున్నాడు.
నానిలో కమెడియన్
మరి ఈ సినిమా జానర్ ఏంటి? అంటే `రన్ రాజా రన్` లా ఈ సినిమా ఉంటుందని సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. `సాహో`, `ఓజీ`లకు భిన్నంగా ఉండే చిత్రమిది అన్నారు. నానిలో తాను చూసిన కోణాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నట్లు తెలిపాడు. రన్ రాజా రన్ తో శర్వానంద్ లో కమెడియన్ ని తట్టి లేపాడు సుజిత్. ఆ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయింది. కామెడీలో కొత్త రకంగా ట్రై చేసి సక్సస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నానితో తీసే సినిమా కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడు. నాని కూడా కామెడీ లో టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఇంత వరకూ ఆతడిలో కామెడీ టింజ్ ని ఏ డైరెక్టర్ పూర్తి స్థాయిలో లాంచ్ చేయలేదు.
మళ్లీ పాత లుక్ తప్పదు:
ఆ బాధ్యత సుజిత్ తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవలే ఓజీ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇకపై ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉంటాని తెలిపాడు సుజిత్. వచ్చే ఏడాది ఆ సినిమా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని `ది ప్యారడైజ్` లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం లుక్ పరంగానూ చాలా మార్పులు తీసుకొచ్చాడు. అయితే సుజిత్ కథకు నాని నుంచి ఆ తరహా లుక్ అవసరం లేదు. సాప్ట్ రోల్ కాబట్టి మళ్లీ నాని పాత ట్రాన్సపర్మేషన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.