స్టార్‌బాయ్ సినిమా వల్లే హిట్ 3 ఆఫర్ వచ్చిందట
పెళ్లికి వచ్చి పిల్లని చూసి కొంత మంది పెళ్లి చేసుకుంటుంటారు. ఇంచుమించి ఇదే పంథాలో ఓ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో అందులో నటిస్తున్న హీరోయిన్‌కి తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడట.;
పెళ్లికి వచ్చి పిల్లని చూసి కొంత మంది పెళ్లి చేసుకుంటుంటారు. ఇంచుమించి ఇదే పంథాలో ఓ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన హీరో అందులో నటిస్తున్న హీరోయిన్‌కి తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడట. అలా ఆఫర్ ఇచ్చిన హీరో మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. కొత్తదనానికి పెద్ద పీట వేసే హీరోల్లో కింగ్ నాగార్జున తరువాత ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు హీరో నాని. ప్రస్తుతం కొత్త వారికి వరుసగా ఆఫర్లు ఇస్తూ నాని వార్తల్లో నిలుస్తున్నాడు. డైరెక్టర్లు, టెక్నీషియన్‌లు, హీరోయిన్‌లకు అవకాశాలిస్తున్నాడు.
ఇదే అలవాటుతో తాజాగా నాని కన్నడ హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చాడట. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `హిట్ ద థర్డ్ కేస్`. డా. శైలేష్ కొలను దర్శకత్వంవహించాడు. నాని నటిస్తూ తన సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్‌లతో అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ మే 1న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఇందులో కేజీఎఫ్ ఫేమ్, కన్నడ బ్యూటీ శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తను అంగీకరించిన తొలి సినిమా స్టార్ బాయ్ సిద్దూ నటిస్తున్న `తెలుసు కదా`. అయితే మేకింగ్ పరంగా ఆలస్యం కావడంతో ముందుగా `హిట్ 3` రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా శ్రీనిధిశెట్టికి రావడం వెనక ఓ విచిత్రమైన స్టోరీ ఉందట. స్టార్ బాయ్ సిద్దూ హీరోగా నీరజ కోనని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ పీపుల్ మీడియా నిర్మిస్తున్న మూవీ `తెలుసుకదా`. ఈ మూవీ ఓపెనింగ్‌కి నాని స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ మూవీలో రాశిఖన్నాతో పాటు శ్రీనిధిశెట్టి కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఓపెనింగ్‌కి వెళ్లిన హీరో నాని అక్కడే శ్రీనిధిశెట్టికి తన హిట్ 3` మూవీలో నటించే అవకాశం ఇచ్చాడట. అదే విషయాన్ని అక్కడే తనకు చెప్పాడట. తనే తన పక్కన కరెక్ట్ అని భావించిన నాని `హిట్ 3` షూటింగ్ ప్రారంభం కాగానే శ్రీనిధిశెట్టిన కన్ఫమ్ చేశాడట. ఇలా అనుకోకుండా తనకు `హిట్ 3`లో నటించే అవకాశం దక్కిందని హీరోయిన్ శ్రీనిధిశెట్టి ఈ సినిమా ప్రమోషన్స్‌లో వెల్లడించి ఆశ్చర్యపరిచింది.