• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సినిమాకి అదే జోరు

నాని సినిమాకి అదే జోరు

| నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-09-03 08:16 GMT

నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నాని కెరియర్ లోనే చాలా వేగంగా కలెక్షన్స్ పెరుగుతూ ఉండటం విశేషం. ఓ వైపు తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల బీభత్సం ఉన్న కూడా పబ్లిక్ నుంచి సరిపోదా శనివారం సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందంట.

మొదటి నాలుగు రోజుల్లోనే 68+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని సరిపోదా శనివారం వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ నిలకడగా వస్తున్నాయంట. ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలకి ఎక్కువ ఆదరణ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా బుక్ మై షో ఆన్ లైన్ బుకింగ్స్ లో కూడా మంచి జోరు చూపిస్తుంది. రిలీజ్ కి ముందు ఆన్ లైన్ బుకింగ్స్ కాస్తా నెమ్మదిగా సాగిన వీకెండ్ నాలుగు రోజులు మాత్రం అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది.

ఆగష్టు 24న ఈ సినిమాకి బుక్ మై షోలో 12.68K టికెట్స్ బుక్ అయ్యాయి. ఆగష్టు 25న కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయిన బుకింగ్స్ 26న మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. ఆగష్టు 29న మరీంత పుంజుకున్న ఈ సినిమా అలానే కొనసాగుతోంది. అంటే వీకెండ్ నాలుగు రోజులు సాలిడ్ కలెక్షన్స్ ని ఈ సినిమా సాధించిందని అర్ధమవుతోంది. సోమవారం కూడా మంచి వసూళ్లనే అందుకుంది.

ఇదే జోరు కొనసాగితే మొదటి వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సరిపోదా శనివారం అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే నాని దసరా మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా సరిపోదా శనివారం సునాయాసంగా బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే నాని కెరియర్ లోనే అతి పెద్ద హిట్ బొమ్మగా సరిపోదా శనివారం నిలిచే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆగష్టు 24 - 12.68K

ఆగష్టు 25 - 16.49K

ఆగష్టు 26 - 19.01K

ఆగష్టు 27 - 31.56K

ఆగష్టు 28 - 90K

ఆగష్టు 29 - 191.44K

ఆగష్టు 30 - 194.58K

ఆగష్టు 31 - 204.71K

సెప్టెంబర్ 1 - 147.15K

సెప్టెంబర్ 2 - 66.07K

Tags:    
  • Nani 
  • Naturalstar 
  • Tollywood 
  • Saripodhaasanivaaram 
  • Filmindustry 
  • Vivekathreya 
  • Boxoffice 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS