లెజెండ్ ప్రశంసపై నాని తన్మయం!
సీనియర్ హీరోలంతా తర్వాత తరం హీరోలందరికీ ఏదో రకంగా స్పూర్తిగా నిలుస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆ సీనియర్ల గురించి ఎంతో గొప్పగా తమ మనసులో భావాలను బయట పెడుతుంటారు.;
సీనియర్ హీరోలంతా తర్వాత తరం హీరోలందరికీ ఏదో రకంగా స్పూర్తిగా నిలుస్తుంటారు. సందర్భం వచ్చినప్పుడు ఆ సీనియర్ల గురించి ఎంతో గొప్పగా తమ మనసులో భావాలను బయట పెడుతుంటారు. నేచురల్ స్టార్ నాని కూడా విశ్వనటుడు కమల్ హాసన్ పై తన అభిమానాన్ని చాటుకున్న సందర్భం ఒకటుంది. 'హిట్ 3' ప్రచారంలో భాగంగా 'హాయ్ నాన్న' సినిమాలో తాను హాస్పిటల్ బయట సీన్ లో నటించే టైం లో కమల్ సార్ సీన్ గుర్తు తెచ్చుకుని చేశా అన్నాడు నాని.
కమల్ హాసన్ నటించిన `విరుమాండి` సినిమాలో ఆయన చివరి సీన్ లో కోర్ట్ లో నిద్రపోతే ఒకరు వచ్చి నిద్రలేపితే ఆయన చేసిన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అంత సహజంగా ఎలా చేస్తారా అనిపిస్తుందని, ఆ సీన్ చాలా ఇష్టమని అందుకే 100 సార్లు చూశానని అన్నాడు నాని. ఆ సీన్ రిఫరెన్స్ తోనే `హాయ్ నాన్న`లో చేశానని అన్నారు నాని. తాజాగా `థగ్ లైఫ్` ప్రచారంలో ఉన్న కమల్ హాసన్ ముందుకు ఈ విషయం వెళ్లింది.
ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలను కమల్ స్వాగతించారు. నా సహచరులు , అభిమానులు నా ప్రదర్శన గురించి మాట్లాడినప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. ప్రేక్షకులతో పాటు నాని నా భావాలను సరిగ్గా అర్దం చేసుకున్నారు. ఓ నటుడికి ఇంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది. గొప్ప ప్రదర్శన ఇచ్చిన ప్పుడు ప్రత్యేకించి కృతజ్ఞతా భావం అవసరం ఉండదు. నాని గురించి కమల్ అలా స్పందించడంతో నాని ఆనందానికి అవధుల్లేవ్.
'ఇది చాలు సార్'. చాలు' అంటూ నాని స్పందించాడు. కమల్ లాంటి లెజెండరీ నోట ప్రశంస అంటే చిన్న విషయమా? నటీనటుల పెర్పార్మెన్స్ గురించి కమల్ హాసన్ చాలా తక్కువగా మాట్లాడుతారు. తన మనసుకు నచ్చితే తప్ప స్పందించరు. అలాంటి కమల్ నోటే నాని ప్రశంస అందుకున్నాడు. అందుకే నాని కూడా చాలు సార్ అంటూ తన భావాన్ని పంచుకున్నాడు.