నాని ప్యారడైజ్ గూస్ బంప్స్ యాక్షన్ ప్లానింగ్..!
న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తర్వాత చేస్తున్న ప్యారడైజ్ సినిమాను త్వరలో మొదలు పెట్టనున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే.;
న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తర్వాత చేస్తున్న ప్యారడైజ్ సినిమాను త్వరలో మొదలు పెట్టనున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ స్టేట్మెంట్ వీడియోనే గూస్ బంప్స్ తెప్పించింది. ఇక సినిమా మరోసారి నాని మాస్ విధ్వంసం ఎలా ఉంటుందో చూపించబోతుందని తెలుస్తుంది. నాని లోని మాస్ యాంగిల్ ని దసరా సినిమాతోనే పీక్స్ లో చూపించాడు శ్రీకాంత్ ఓదెల. ఆ సినిమా నుంచి నాని ఇమేజ్ మారిపోయింది.
హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా మరోసారి నాని అదరగొట్టాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి తన మాస్ అప్పీల్ తో ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ అందించాలని చూస్తున్నాడు. ఐతే నాని ప్యారడైజ్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉండేలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారట. తప్పకుండా ఈ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ అందిస్తాయని అంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దసరా కన్నా ప్యారడైజ్ సినిమాను ఇంకాస్త కసితో చేస్తున్నాడని తెలుస్తుంది. నాని క్యారెక్టరైజేషన్ అయితే వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు. నాని కెరీర్ లో హైయెస్ట్ మూవీగా ప్యారడైజ్ రాబోతుంది.
ఐతే ఈ సినిమా విషయంలో నాని కూడా చాలా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడని తెలుస్తుంది. హిట్ 3 సినిమా తర్వాత నాని చేస్తున్న ఈ ప్యారడైజ్ సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని అంటున్నారు. మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి. నాని ప్యారడైజ్ కాస్టింగ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందట. త్వరలోనే మరో అప్డేట్ తో సినిమా ఫుల్ కాస్ట్ అండ్ క్రూ వెళ్లడిస్తారని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనౌన్స్ చేయడమే ఆలస్యం మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ అందుకున్నాడు. శ్రీకాంత్, చిరంజీవి సినిమాను నాని నిర్మించడం అనేది స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు. ప్యారడైజ్ రీచ్ అయ్యే విధానాన్ని బట్టి మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా రేంజ్ సెట్ చేస్తారని తెలుస్తుంది.