ఇంకా సైలెంట్ మోడ్‌లోనే నేచురల్ స్టార్?
నేచురల్ స్టార్ నాని ఇటీవలే 'హిట్:ది థర్డ్ కేస్'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.;
నేచురల్ స్టార్ నాని ఇటీవలే `హిట్:ది థర్డ్ కేస్`తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి నాని కెరీర్‌లో మరో రూ.100 కోట్ల మూవీగా నిలిచింది. మే 1న ఐదు భాషల్లో విడుదలైన `హిట్ 3` ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఐదు భాషల్లో టాప్‌లో ట్రెండ్ కావడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై..ఓటీటీలోకి వచ్చేసినా నాని మాత్రం ఇప్పటికీ సైలెంట్ మోడ్‌లోనే ఉన్నాడు.
ఇది ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేస్తోంది. `హిట్ 3`తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాని అదే ఊపులో తదుపరి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తాడు అనుకుంటే సైలెంట్ మోడ్‌లోనే ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మూవీ తరువాత `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని `ది ప్యారడైజ్` పేరుతో ఓ భారీ పాన్ ఇండయా సినిమాకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గ్లింప్స్‌ని మూడు నెలల క్రితమే అంటే మార్చి 3న విడుదల చేశారు.
దీని కోసం ఏకంగా టీమ్ కోటీ ఖర్చు చేసినట్టుగా వార్తలు వినిపించాయి. సికింద్రాబాద్ లోని పారడైజ్ ఏరియాలో జరిగిన ఓ యాదార్ధ సంఘటన ఆధారంగా తెలంగాణకు చెందిన ఓ రచయిత రాసిన బుక్ ఆధారంగా ఈ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఓ వేశ్య కొడుకు కథగా, తల్లి పంతం కోసం ఓ కొడుకు చేసిన సమరం నేపథ్యంలో ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. గత కొంత కాలంగా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
`దసరా`ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో రూపొందబోతోందని ఇప్పటికే గ్లింప్స్‌లోని సన్నివేశాలు, డైలాగ్‌లతో స్పష్టమైంది. గ్లింప్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాటు నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగానూ భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఇంత వరకు దీని షూటింగ్‌కు సంబంధించిన అప్ డేట్ లేదేంటనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాని సైలెంట్ మోడ్‌ని వీడి ది ప్యారడైజ్` షూటింగ్ అప్ డేట్‌ని ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నాని వారి మాటలు వింటున్నాడా? షూటింగ్ అప్ డేట్‌నిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.