ఆ కుర్రాడి కథను నాని ఏం చేశాడు..?

న్యాచురల్ స్టార్ నాని ఈమధ్యనే హిట్ 3 తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా పట్ల తనకున్న కమిట్మెంట్ ఎలాంటిదో హిట్ 3 తో మరోసారి ప్రూవ్ చేశాడు నాని.;

Update: 2025-05-22 15:45 GMT

న్యాచురల్ స్టార్ నాని ఈమధ్యనే హిట్ 3 తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా పట్ల తనకున్న కమిట్మెంట్ ఎలాంటిదో హిట్ 3 తో మరోసారి ప్రూవ్ చేశాడు నాని. సైంధవ్ తో ఫ్లాప్ అందుకున్న శైలేష్ తో హిట్ ఫ్రాంచైస్ తీయాలని అనుకోవడం పెద్ద సాహసమే అలా చేసి హిట్ సాధించాడు నాని. హిట్ 3 విషయంలో ప్రతి యాస్పెక్ట్ లో నాని యాక్షన్ ప్లాన్ తెలుస్తుంది. అంతేకాదు కథల విషయంలో నాని ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడో అర్థమవుతుంది.

ఐతే నాని హిట్ 3 సినిమాను కేవలం తెలుగు మాత్రమే కాదు మిగతా సౌత్ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఐతే నాని సినిమాలు ఈమధ్య సౌత్ అంతటా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో నానికి ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. నాని హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా కేరళ కి వెళ్తే అక్కడ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అక్కడ నాని అభిమాని ఒకతను నాని కోసం ఏకంగా ఒక కథ కూడా సిద్ధం చేశాడని వెల్లడించాడు.

నాని కూడా అతను రాసిన కథను చదువుతానని అతని దగ్గర నుంచి ఆ పేపర్స్ తీసుకున్నాడు. నిజంగా నానికి ఆ కథ నచ్చితే మాత్రం అతనికి ఛాన్స్ వచ్చినట్టే లెక్క. ఎందుకంటే నిజమైన కథలను నాని ఎంకరేజ్ చేస్తాడు. ఒకవేళ కథ బాగుండి తనకు సూట్ అవ్వదు అనుకున్నా కూడా నాని ఎలాగు ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి అలా అయినా అతని కథను తీసుకునే అవకాశం ఉంటుంది.

సో నాని కి కథ ఇచ్చిన ఆ కుర్రాడిలో టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా నాని అతనికి అవకాశం ఇస్తాడు. ఇటు హీరోగా తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న నాని నిర్మాతగా కూడా ఆడియన్స్ ని మెప్పించే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఐతే నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నాని ప్యారడైజ్ నెక్స్ట్ మార్చి రిలీజ్ అవుతుండగా ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం చిరు సినిమాపై ఫోకస్ చేయనున్నారు.

Tags:    

Similar News