నాని సినిమాల్లో 'హిట్ 3' స‌రికొత్త రికార్డ్‌!

మే 1న భారీ స్థాయిలో రిలీజ్‌కాబోతోంది. ఇటీవ‌లే అడ్వాన్స్ బుకింగ్స్‌ని ఓపెన్ చేశారు. ఇప్ప‌టికే యుఎస్‌లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.;

Update: 2025-04-21 07:26 GMT

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `హిట్‌: ది థ‌ర్డ్ కేస్‌`.శైలేష్ కొల‌ను రాఫిల్మ్‌గా హైవోల్టేజ్ యాక్ష‌న్ కంటెంట్‌తో నాని సినిమాల్లోనే నెవ‌ర్ బిఫోర్ బ్ల‌డ్ షేడ్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. నాని నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో న‌టించిన ఈ మూవీపై వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


మే 1న భారీ స్థాయిలో రిలీజ్‌కాబోతోంది. ఇటీవ‌లే అడ్వాన్స్ బుకింగ్స్‌ని ఓపెన్ చేశారు. ఇప్ప‌టికే యుఎస్‌లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆడియ‌న్స్‌, నాని ఫ్యాన్స్ టికెట్ బుకింగ్స్ విష‌యం పోటీప‌డుతుండ‌టంతో అడ్వాన్స్ ప్ర‌స్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అడ్వాన్స్ టికెట్‌ సేల్స్ 75కె దాట‌డం నాని సినిమాల్లో స‌రికొత్త రికార్డుగా చెబుతున్నారు. సినిమా రిలీజ్‌కు ప‌ది రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించ‌డంతో `హిట్ 3` స‌రికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేయ‌డం విశేషం.

బుకింగ్స్ ప్రారంభించిన ప‌ది రోజుల ముందే నాని సినిమా ఈ ఫీట్‌ని సొంతం చేసుకోవ‌డంతో `హిట్ 3` ఓపెనింగ్స్ భారీగా ఉండే అవ‌కాశ ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. అంతే కాకుండా నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో 75కె మార్కుని రీచ్ అయినా సినిమాగా `హిట్ 3` టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. ఇదే త‌ర‌హాలో ఫాస్టెస్ట్ 1 మిలియ‌న్ డాల‌ర్ ప‌స్రీ సెల్స్ రికార్డుని హిట్ 3` సాధించ‌డం ఖాయం అని ఫిల్మ్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇదే నిజ‌మైతే ఓవ‌ర్సిస్‌లో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌ని ఈ సినిమాతో రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. `ద‌స‌రా`తో టైర్ టు హీరోల్లో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచిన నాని `హిట్ 3`తో మ‌రో రికార్డుని సాధించ‌డం ఇక న‌ల్లెరు మీద న‌డ‌కే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీని ఓవ‌ర్సీస్ రైట్స్‌ని భారీ మొత్తానికి అమ్మేశారు. బ్రేక్ ఈవెన్‌ని సాధించాలంటే 2 మిలియ‌న్ డాల‌ర్‌ని సాధించాలి. హిట్ 3పై ఉన్న‌ క్రేజ్ ప్ర‌కారం నానికిది చాలా ఈజీగా క‌నిపిస్తోంది. మే 1న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నాని కెరీర్‌లో తిరుగులేని రికార్డుల్ని క్రియేట్ చేయ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News