నాని 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్ బిగ్ ట్విస్ట్!
సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.;
నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3' పై అంచనాలు భారీగా ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన హిట్ ప్రాంచైజీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే మూడో పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మొదటి రెండు పార్ట్‌లతో పోల్చితే ఈ సినిమాను మరింత యాక్షన్‌తో రూపొందించారు. నానిని గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత క్రూరమైన పాత్రలో చూపించినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థం అవుతుంది. చిన్న పిల్లలు చూడలేనంత హింసాత్మక సన్నివేశాలు హిట్ 3 లో ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ఒప్పుకున్నారు.
సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో మేకర్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా నాని సినిమా అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహిస్తారని అంతా అనుకుంటారు. కానీ ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. నాని అభిమానులు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ ట్విస్ట్ ఇచ్చి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేయడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.
హైదరాబాద్‌లోనూ పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు, చిన్న చిన్న టాక్ షోలకు సంబంధించిన కార్యక్రమాలను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసిన నాని టీం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాత్రం తిరుపతిలో నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంకు వచ్చారట. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి 27వ తారీకును ఖరారు చేశారని, త్వరలోనే వెన్యూను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నాని ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్న విషయం తెల్సిందే.
నానికి జోడీగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించింది. కన్నడ స్టార్ హీరో యశ్‌తో కలిసి ఈమె కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 లో నటించిన విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడంతో శ్రీనిధి క్రేజ్ భారీగా పెరిగింది. అయినా కూడా ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. హిట్ 3 తర్వాత తెలుగులో ఈమె బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టైర్ 2 హీరోలకు జోడీగా ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వరుస ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించగా నాని ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. హిట్ 3 లో స్టార్ హీరో గెస్ట్ అప్పియరెన్స్ గురించి ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి.