ఇంతకీ నానికి వెన్నెల దొరికిందా..?
న్యాచురల్ స్టార్ నాని మరో వారం రోజుల్లో హిట్ 3 తో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.;
న్యాచురల్ స్టార్ నాని మరో వారం రోజుల్లో హిట్ 3 తో రాబోతున్నాడు. ఈ సినిమా విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నాని సినిమా వెంట సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.హిట్ 3 ఇలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం నెక్స్ట్ ప్యారడైజ్ మీద తన ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో నాని ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న నాని ఆఫ్టర్ రిలీజ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్యారడైజ్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీకాంత్ ఓదెల, నాని చేసిన దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
ఆమెనే ఈ సినిమాలో కూడా రిపీట్ చేస్తారా అంటే చెప్పడం కష్టమే. కీర్తి సురేష్ ఆల్రెడీ తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క నితిన్ ఎల్లమ్మ సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని టాక్. సో ప్యారడైజ్ లో కీర్తి మాక్సిమం ఉండే ఛాన్స్ కనిపించట్లేదు. అసలు నాని ప్యారడైజ్ లో హీరోయిన్ రోల్ ఎలా ఉంటుంది. ఒకవేళ పవర్ ఫుల్ రోల్ అయితే నాని ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.
దసరా సినిమాలో హీరోయిన్ వెన్నెలగా కీర్తి సురేష్ నటించింది. మరి అదే డైరెక్టర్ చేస్తున్న ప్యారడైజ్ లో నానికి వెన్నెల దొరికిందా లేదా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ 3 ప్రమోషన్స్ లో ప్యారడైజ్ గురించి పెద్దగా లీక్స్ ఇవ్వని నాని సినిమా మాత్రం అంచనాలకు మించి అంటున్నాడు. మరి దసరాతో తన మాస్ స్టామినా ప్రూవ్ చేసుకున్న నాని నెక్స్ట్ ప్యారడైజ్ తో ఎలాంటి హంగామా చేస్తాడన్నది చూడాలి. నానికి ప్యారడైజ్ మరో బ్లాక్ బస్టర్ బొమ్మగా ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. ఐతే సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని నాని ఊరిస్తున్నాడు. ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ టీజర్ తోనే నాని ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.