ప్యారడైజ్ కూడా ఇటుకేనా.. మరి గోడ ఎప్పుడు రెడీ?
అంతేకాదు.. ఏ సినిమా అయినా ఒక ఇటుకేనని క్లారిటీ ఇచ్చారు. అంటే నాని లెక్కలో ది ప్యారడైజ్’ ఫైనల్ డెస్టినేషన్ కాదు. తన కెరీర్ అనే పెద్ద గోడలో ఇదొక స్ట్రాంగ్ ఇటుక మాత్రమే అన్నమాట.
'ఒక్కో ఇటుక పేర్చుకుంటూ గోడ కడుతున్నా.. ఆ గోడ ఏంటో రేపు తెలుస్తుంది'.. అంటూ నాని చేసిన ఆ కామెంట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఏ సినిమా గురించి మాట్లాడినా.. ఎక్కడ ఏ అప్డేట్ వచ్చినా.. ఇటుక, గోడ పదాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ది ప్యారడైజ్ ప్రెస్ మీట్ లో కూడా వినిపించింది. దీంతో అసలు నాని కడుతున్న ఆ గోడ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రెస్ మీట్ లో 'మీరు ఇటుక ఇటుక పేర్చి గోడ కడుతున్నానని చెప్పారు కదా.. ఆ గోడే ది ప్యారడైజ్ ఏమో అనుకున్నాం' అంటూ మీడియా ప్రశ్నించగా.. నాని ఇచ్చిన ఆన్సర్ మాత్రం సింపుల్ గా ఉంది. ప్యారడైజ్ కూడా ఇటుకేనని చెప్పేశారు. అంతేకాదు.. ఏ సినిమా అయినా ఒక ఇటుకేనని క్లారిటీ ఇచ్చారు. అంటే నాని లెక్కలో ది ప్యారడైజ్’ ఫైనల్ డెస్టినేషన్ కాదు. తన కెరీర్ అనే పెద్ద గోడలో ఇదొక స్ట్రాంగ్ ఇటుక మాత్రమే అన్నమాట.
ఆ ఒక్క కామెంట్ తోనే నాని తన కెరీర్ ను ఎలా చూస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇక తన 'ఇటుక.. గోడ' డైలాగ్ ఇంతగా వైరల్ అవుతుందని తాను అసలు ఊహించలేదట. ఫ్లోలో అలా చేసిన కామెంట్ ను ప్రతి విషయానికీ వాడుతున్నారని నాని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఎందుకు అంత వైరల్ అవుతుందో తనకే అర్థం కావడం లేదని, అయితే దాన్ని పాజిటివ్ గా యూజ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని అన్నారు.
నిజానికి నాని కెరీర్ ను చూస్తే ఆ ఇటుక కామెంట్ కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. క్లాప్ అసిస్టెంట్ గా మొదలుపెట్టి, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత రేడియో జాకీగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్కో సినిమాతో తన మార్క్ ను పెంచుకుంటూ వచ్చారు.
అష్టాచమ్మాతో మొదలైన జర్నీ.. అలా మొదలైంది, ఈగ, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, ఎంసీఏ వంటి సినిమాలతో మరింత స్ట్రాంగ్ గా మారింది. ఆ తర్వాత పలు చిత్రాలతో నటుడిగా తన రేంజ్ ఏంటో చూపించారు. ఇక దసరాతో మాత్రం నాని మాస్ ఇమేజ్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ పడింది. ఇప్పుడు ది ప్యారడైజ్ తో అదే మాస్ జోనర్ ను మరింత బిగ్ రేంజ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నారు.
నాని లుక్, రోల్, సినిమా వరల్డ్ .. ఈసారి మరింత రఫ్ గా, వైల్డ్ గా ఉండబోతున్నాయన్న హింట్స్ ఇప్పటికే వచ్చేశాయి. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ప్యారడైజ్ హిట్ అవుతుందా? అనేది కాదు. నాని కడుతున్న ఆ గోడలో తర్వాత ఇటుక ఏంటి? అనేదే. ఇక నాని మాటల్లోనే చెప్పాలంటే.. ప్యారడైజ్ కూడా ఓ ఇటుకే. మరి ఆ గోడ ఎప్పుడు రెడీ అవుతుంది? అన్నది తెలియాలంటే ఇంకొన్ని ఇటుకలు పేర్చాల్సిందేమో!