ఆయన్ని అనుకుని ఈయన్ని తెస్తున్నారా?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో `బ్లడీ రోమియో` టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.;
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో `బ్లడీ రోమియో` టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే సుజిత్ `ఓజీ`తో సక్సెస్ అందుకోవడంతో కొత్త ప్రాజెక్ట్ ని రెట్టించిన ఉత్సాహంతో పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక పనుల్లో బిజీ అయ్యాడు. సినిమాలో హీరోయిన్? ప్రధాన విలన్ ఎవరు? అన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో విలన్ పాత్రకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
డేట్లు సర్దుబాటు కాకపోవడంతో:
ఇందులో విలన్ పాత్ర కోసం మాలీవుడ్ స్టార్ పృద్వీరాజ్ సుకుమారన్ తో చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే ఆయన్ని సంప్రదించగా పాజిటివ్ గా స్పందించారుట. తుది నిర్ణయం..తన బిజీ షెడ్యూల్ చూసుకుని చెప్పడానికి నెల రోజులు సమయం అడిగారుట. అందుకు సుజిత్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తొలుత ఈ పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను అప్రోచ్ అయ్యారట. కానీ ఆయన డేట్లు సర్దుబాటు విషయంలో వీలు పడకపోవడంతో నో చెప్పారుట. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ పృధ్వీరాజ్ కు వెళ్లున్నట్లు కనిపిస్తోంది.
విలన్ పాత్రలో కామెడీ:
ఈ సినిమా ఎలా ఉంటుందన్నది ఇప్పటికే సుజిత్ హింట్ ఇచ్చాడు. 'రన్ రాజా రన్' తరహాలో ఆద్యంతం వినోదాత్మక చిత్రమని లీక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విలన్ పాత్ర కూడా కామిక్ గానే ఉంటుందని సుదీప్ అయితే పక్కాగా యాప్ట్ అవ్వడంతో అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. `ఈగ` సినిమాలో సుదీప్ పాత్రలో రాజమౌళి కాస్త కామిక్ గానూ చూపించారు. సినిమాకు ఆ పాత్ర ఎంతగానో కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో సుజిత్ కూడా అలాంటి రోల్ రాసాడా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ప్యారడైజ్ తో పాటు మొదలవుతుందా:
మరి ఇదే పాత్రకు పృధ్వీరాజ్ ను తెరపైకి తీసుకురావడం ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం నాని `ది ప్యారడైజ్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్. వచ్చే ఏడాది వరకూ గానీ షూటింగ్ పూర్తి కాదు. వచ్చే ఏడాది నుంచే సుజిత్ కూడా నానితో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్యారడైజ్ తో పాటు ఏకకాలంలో ఈ చిత్రం కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడడతారా? పూర్తయ్యే వరకూ వెయిట్ చేస్తారా? అన్నది చూడాలి.