ట్రైలర్: లవర్ మోసం చేస్తే.. 'సైక్' గా నందు రచ్చ!

కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి చేసిన ప్రయత్నమే 'సైక్ సిద్ధార్థ'. గతంలో వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా థీమ్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేసింది.;

Update: 2025-12-02 12:51 GMT

టాలీవుడ్ లో డిఫరెంట్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నందు, ఈసారి తనలోని కొత్త కోణాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మారి చేసిన ప్రయత్నమే 'సైక్ సిద్ధార్థ'. గతంలో వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమా థీమ్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేసింది. బ్రేకప్ స్టోరీని సీరియస్ గా కాకుండా, కొంచెం తిక్కగా, ఫన్నీగా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ హింట్ ఇస్తోంది.



 


రిలీజ్ అయిన ట్రైలర్ ను గమనిస్తే.. జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకునే ఒక యువకుడి కథలా కనిపిస్తోంది. అయితే బిజినెస్ లో ఫెయిల్ అవ్వడం, అదే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయి 'త్రిష' తనను కాదని వేరే ధనవంతుడిని పెళ్లి చేసుకోవడం హీరోని 'సైక్' అయ్యేలా చేస్తాయి. లవ్ ఫెయిల్యూర్ బాధను మందుతో కాకుండా, ఫ్రస్ట్రేషన్ తో చూపించిన విధానం ఈ ట్రైలర్ లో హైలైట్ పాయింట్.

ముఖ్యంగా నందు చెప్పే డైలాగులు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు ప్రధాన బలంలా అనిపిస్తున్నాయి. "త్రిషను ఏసేస్తా" అంటూ పగతో రగిలిపోవడం, ఫ్రెండ్స్ తో తన బాధను చెప్పుకునే సీన్స్ లో కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయ్యింది. మాజీ ప్రియురాలిని మర్చిపోలేక, పక్కింటి అమ్మాయితో కొత్తగా పరిచయమైన ట్రాక్ ను బ్యాలెన్స్ చేస్తూ సాగే పాత్రలో నందు నటన సహజంగా ఉంది.

వరుణ్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టేకింగ్ లో కొత్తదనం కనిపిస్తోంది. సీరియస్ సీన్లకు కూడా ఫన్నీ మ్యూజిక్ ఇవ్వడం, మీమ్స్ స్టైల్ లో ఎడిటింగ్ చేయడం యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా వంటి పెద్ద బ్యానర్లు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ప్రాజెక్ట్ పై జనాల్లో నమ్మకం ఏర్పడింది.

సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇతర పాత్రలు కూడా ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో చూపించిన ఆ 'సైక్' కాన్సెప్ట్ రెండు గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయగలిగితే, నందు ఖాతాలో ఒక మంచి హిట్ పడే అవకాశం ఉంది. మరీ ఓవర్ హైప్ లేకుండా, ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News