• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యారెక్టర్ కొత్తగా ఉంటే...

క్యారెక్టర్ కొత్తగా ఉంటే అన్ని మారిపోతాయ్.. డెవిల్ హై మూమెంట్ అదే..!

| 2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను నెరేట్ చేశారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది

By - Tupaki Desk
Update: 2023-12-26 11:49 GMT

టాలీవుడ్ లో కొత్త ప్రయోగాలు చేసే హీరోల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒకరు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చెప్పాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. బింబిసార తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ మధ్యలో అమిగోస్ నిరాశపరిచినా డెవిల్ అంటూ మరో క్రేజీ అటెంప్ట్ తో వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబర్ 29న భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డెవిల్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.

2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను నెరేట్ చేశారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమా డెవిల్. కథ వినగానే నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను చేశారా? అని నేను అడిగాను. అప్పుడాయన మాట్లాడుతూ నేను దీన్ని కథగానే చేశాను. అభిషేక్‌ నామాగారు మీకు నెరేట్ చేయమంటే కమర్షియల్ హీరో కదా, ఆయన ఒప్పుకుంటారా అని అనున్నా అన్నారు. అప్పుడు నేను శ్రీకాంత్‌కి రెండు విషయాలు చెప్పాను. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ అలాగే ఉండనిచ్చి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే సినిమా చేద్దామని అన్నాను. అప్పటికే బింబిసార సినిమా సగం పైగానే పూర్తయ్యింది. మనం ఎలాంటి సినిమా చేస్తున్నాం. ఎలా వస్తుందనేది అప్పటికే ఓ ఆలోచనకు వస్తుంది. కాబట్టి శ్రీకాంత్‌కి స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించాను. దాంతో శ్రీకాంత్ రెండు, మూడు నెలలు కూర్చుని మార్పులు చేర్పులు చేశారు. తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేశాం. దీనికి ఏడాది సమయం పట్టింది. మేకింగ్ కోసం ఏడాది సమయం పట్టింది.

ప్రేక్షకులకు కొత్త సినిమాలను అందించాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక్కసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతుంటాను. ఉదాహరణకు అమిగోస్ సినిమా విషయానికి వస్తే అందులో డాపల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ ఉంది. దాన్ని చెప్పే క్రమంలో ఎక్కడో ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆరోజు రాలేదు. డైరెక్టర్ తో కూర్చుని మాట్లాడి ఆ పని చేసుండాల్సింది. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్ ఫైర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయంలో కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి ఉండటం నాకు కొత్తగా అనిపించింది. ఇది పక్కా ఫిక్షనల్ మూవీ.

సౌందర్ రాజన్‌గారు సినిమాటోగ్రాఫర్ అనగానే నేను కథ వినేటప్పుడు ఎలా ఉంటుందని అంచనా వేసుకున్నానో దాన్ని మించేలానే విజువల్స్ ఉంటుందని నిర్ణయించుకున్నాను. అలాగే రాజేష్ తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. డెవిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసినప్పుడు.. హీరో లుక్ ఎలా ఉండాలని అనుకున్నప్పుడు రాజేష్ రెఫరెన్స్ తీసుకొచ్చి చూపించారు. అది చూడగానే నాకు హ్యాపీగా అనిపించింది. నా క్యారెక్టర్‌కి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారు.

పాత్రను చేసేటప్పుడు నేనేమీ ప్రత్యేకమైన పద్ధతులన పాటించను. కథలో ఉండే క్యారెక్టర్ మనకు కొత్తగా అనిపిస్తే.. మన డైలాగ్ డెలివరీ, నటించే పద్ధతి అన్నీ మారిపోతాయి.

డెవిల్ సినిమాలో హై మూమెంట్స్, దేశభక్తి గురించి చెప్పాలంటే సినిమా చూడాల్సిందే.

హర్షవర్ధన్ రామేశ్వర్ గురించి చెప్పాలంటే అర్జున్ రెడ్డి సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేశారని అభిషేక్ నామాగారు చెప్పారు. తనే డెవిల్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమాకు హర్ష అందించిన బీజీఎం చాలా బావుంది. డెవిల్ విషయానికి వస్తే పాటలు ఓ వైపు ఉంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్ దాన్ని బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. బింబిసారలో కీరవాణిగారిలా న్యాయం చేస్తాడా అనిపించింది. అయితే సినిమా చూసిన తర్వాత హ్యాపీగా అనిపించింది.

డెవిల్ సినిమాలో ఎలాంటి గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని ఎంటైర్ టీమ్ ఎంతో డీటెయిల్డ్‌గా వర్క్ చేసి చేశాం. రేపు దాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు.

సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ పాత్రలు చాలా చక్కగా ఉంటాయి. వీరి పాత్రలే కాదు.. ప్రతీ పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుంది. హీరోకు సమానంగా సంయుక్తా మీనన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే మాళవికా నాయర్ పాత్రకు ప్రాముఖ్యత ఉంది.

నటనలో ఎంత కష్టపడాలో ప్రొడక్షన్‌లో అంతకు మించి కష్టపడాలి. ఓం సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. ఆ తర్వాత మా బ్యానర్ లో చేసే సినిమాలకు సంబంధించిన కథ వింటాను. మిగిలిన విషయాలను మా హరిగారు చూసుకుంటారు.

డెవిల్ సినిమాకు సీక్వెల్ గురించి ఓసారి డిస్కషన్ చేశాం. 40-50 శాతం స్క్రిప్ట్ వర్క్ అయితే చేశాం. ఓ దశలో షూటింగ్ కూడా చేయాలనుకున్నాం. కానీ వద్దనుకున్నాం. డిసెంబర్ 29న డెవిల్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ అనౌన్స్ చేస్తాం.

ఇప్పుడు ఓ సినిమా సెట్స్ పై ఉంది. దాని తర్వాతే బింబిసార 2 స్టార్ట్ చేస్తాను.

మేం చేసే సినిమాలు గొప్పగా ఉండాలని అనుకుంటాం. అందుకనే ఔట్‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. నేను, తారక్ దేవర విషయంలో క్లియర్ ఉన్నాం. ఇద్దరికీ మాకొక క్లారిటీ వచ్చి క్లియర్‌గా లేకపోతే ఓ న్యూస్ గురించి స్పందించ కూడదని నిర్ణయించుకున్నాం.

నటుడిగా ఇరవై ఏళ్ల జర్నీపూర్తయ్యింది. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. తండ్రిగా, భర్తగా, సినిమాల పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను.

Tags:    
  • Devilmovie 
  • Nandamurikalyanram 
  • Devil 
  • Kalyanram 
  • Samyukthamenon 
  • Abhisheknama 
  • Tollywood 

Similar News

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

Copyright @2026

Powered by Blink CMS