మహేష్ బాబు ఇంట్లో విషాదం.. నమ్రత ఎమోషనల్ పోస్ట్!

అసలు విషయంలోకి వెళ్తే.. నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. తమ పెంపుడు కుక్క నోబు మరణించినట్లు తెలిపింది.;

Update: 2025-12-17 10:16 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా తన తండ్రితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు. మొన్నటి వరకు టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. 2027 సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రముఖ గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా మందాకిని పాత్రలో నటిస్తోంది. అలాగే మాలీవుడ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కుంభ అనే కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూడగా...ఇటీవల గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. తమ పెంపుడు కుక్క నోబు మరణించినట్లు తెలిపింది. తన పెంపుడు కుక్కతో తన కూతురు సితార ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. "నా మొదటి చిన్న పెద్ద కొడుకుకి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నాను. నువ్వు లేని లోటును ఎవరు తీర్చలేరు. నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు.." అంటూ ఎమోషనల్ అయ్యింది. "నోబుతో మాకు మా జీవితాలలో విడదీయరాని బంధం ఏర్పడింది. నోబు మా కుటుంబానికి అపారమైన ఆనందాన్ని, ప్రేమను తెచ్చి పెట్టాడు. నిన్ను మిస్ అవుతున్నాను.. నువ్వు ఎప్పుడు కూడా మా గుండెల్లో నిలిచిపోతావు.. నీపై ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ తగ్గవు" అంటూ క్యాప్షన్ లో రాసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. మరొకవైపు 2013లోనే వారి మరో పెంపుడు కుక్క ఫ్లూటో మరణించింది. ఈ విషయాన్ని కూడా అప్పట్లో తన సోషల్ మీడియాలో తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే నమ్రత , మహేష్ బాబు జంట ఎప్పుడూ కూడా పెంపుడు జంతువులను తమ కుటుంబంలో ఒక భాగంగా భావిస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అటు వీరి పిల్లలు గౌతమ్ , సితార కూడా ఆ పెంపుడు కుక్కలతో కలిసి దిగిన ఎన్నో ఫోటోలు నమ్రత షేర్ చేసింది. పెంపుడు కుక్కలతో వీరికి విడదీయరాని బంధం ఏర్పడింది. అలాంటి ఈ పెంపుడు కుక్క మరణించడంతో నమ్రత ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో.. నోబుకి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News