కట్టు బొట్టులో అచ్చం తెలుగమ్మాయిలే!
తాజాగా ఈ జోడీ 'ప్రపంచ తోబుట్టువుల దినోత్సవాన్ని' సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.;

ఈ సృష్టిలో అక్కా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. నమ్రతా శిరోద్కర్- శిల్పా శిరోద్కర్ సిస్టర్స్ అనుబంధం ఎల్లపుడూ అభిమానుల్లో చర్చగా మారుతుంది. తాజాగా ఈ జోడీ 'ప్రపంచ తోబుట్టువుల దినోత్సవాన్ని' సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇది త్రోబ్యాక్ ఫోటోనే అయినా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో అక్కా చెల్లెళ్లు సాంప్రదాయబద్ధంగా కట్టుబొట్టుతో ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు. స్వతహాగానే ఆ ఇద్దరూ ముంబై లాంటి మెట్రో కల్చర్ లో పెరిగారు. కానీ అందుకు భిన్నంగా సాంప్రదాయాన్ని గౌరవిస్తారు అనడానికి ఇది సింబాలిక్. సిస్టర్స్ తరచుగా సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించినా ట్రెడిషనల్ లుక్ తో ఎక్కువ ఆకర్షిస్తుంటారు.
త్రోబ్యాక్ ఫోటోలో నమ్రతా - శిల్పా ఇద్దరూ సాంప్రదాయ చీరకట్టులో కనిపించారు. నర్మతా గులాబీ - ఆకుపచ్చ రంగు చీరను ధరించగా, శిల్పా బంగారు రంగు చీరను ధరించింది. కెమెరాకు పోజులిచ్చేటప్పుడు ఇద్దరూ సింపుల్ గా చిరునవ్వుతో ఆకట్టుకున్నారు. ``హ్యాపీ సిబ్లింగ్స్ డే, నాకు ఇష్టమైన వ్యక్తి!`` అని నమ్రతా క్యాప్షన్‌లో రాశారు. చాలా మంది అభిమానులు సిస్టర్స్‌ని ప్రశంసించారు.`ఇద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు` అని తోబుట్టువుల మధ్య సారూప్యతలను కొందరు ఎత్తి చూపారు.
శిల్పా శిరోద్కర్ ఇటీవల బిగ్ బాస్ 18లో సందడి చేసారు. షోలో ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు నమ్రతా తన సోదరితో ఉన్న ఫోటోని షేర్ చేసారు. తన సోదరి తిరిగి వచ్చినందుకు నమ్రత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబును వివాహం చేసుకున్న నమ్రత 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ యూనివర్స్ పోటీలో ఆరవ స్థానంలో నిలిచారు. శిల్పా శిరోద్కర్ కూడా నటీమణి అన్న సంగతి తెలిసిందే. 1998-2000 మధ్య ఎక్కువ చిత్రాల్లో నటించింది. కానీ ఇటీవల సినిమాలకు దూరంగా ఉంది.