• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  PRO వ్యవస్థపై నాగవంశీ...

PRO వ్యవస్థపై నాగవంశీ అప్పుడు కామెంట్స్.. ఇప్పుడు ఇలా..

| టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా పీఆర్వో వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

By - M Prashanth
Update: 2025-07-30 17:32 GMT

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా పీఆర్వో వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాల్లో అవి చర్చనీయాంశంగా మారాయి. అప్పుడు చాలా మంది పీఆర్వోలు హర్ట్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై కింగ్ డమ్ మూవీ ప్రమోషన్స్ లో నాగవంశీకి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి.

మరికొన్ని గంటల్లో కింగ్ డమ్ మూవీ రిలీజ్ కానుండగా.. మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు నాగవంశీ. ఆ సమయంలో సినిమా హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన క్వశ్చన్ లకు విజయ్ సమాధానాలిచ్చారు. అదే సమయంలో నాగవంశీ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

"పీఆర్వోలు బెదిరిస్తున్నారు... బ్లాక్ మెయిల్ చేసే రేంజ్ కి వెళ్లి పోయారు అని చెప్పారు. కొందరికి చాలా మందికి కోపం వచ్చింది.. వ్యవస్థను అన్నారు.. పర్టిక్యులర్ గా ఎవరి పేరు చెప్పాలని అనుకున్నారా? మీరు దాని గురించి ఓపెన్ అవ్వాలని అనుకుంటున్నారా?" అని అడగ్గా.. తాను కింగ్ డమ్ తప్ప దేని కోసం ఓపెన్ అవ్వనని చెప్పారు.

"ఒక చిన్న క్లారిటీ కావాలి.. పీఆర్వీల వ్యవస్థపై కామెంట్స్ చేశారు.. దాని వల్ల హర్ట్ అయ్యారు.. ఎవరిని అనాలనుకోవాలో వారినే అనాలి.. పీఆర్వీ వ్యవస్థను నిందించారు. కానీ అందరినీ అనడం కరెక్ట్ కాదు" అని నాగవంశీని ప్రశ్నించగా.. కింగ్ డమ్ రిలీజ్ అయ్యాక పీఆర్వోలందరితో కలిసి కూర్చొని మాట్లాడుతానని అన్నారు.

"కామెంట్ చేసి.. ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ఓపెన్ చేశారు.. బెదిరిస్తారా అంటూ చాలా మంది అడుగుతున్నారు.. నింద వేసి తప్పించుకోవడం తప్పు" అని అనగా.. తాను జోక్ చేశానని చెప్పండని నాగవంశీ తెలిపారు. మళ్లీ అడగ్గా.. ప్లీజ్ సర్ రిలీజ్ ఉందని అన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే.. మీడియాతో సరైన సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్‌ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుందని వ్యాఖ్యానించారు నాగవంశీ. గత 15 ఏళ్లుగా తామే దానిని అలా క్రియేట్‌ చేసుకున్నామనిపిస్తుందని అన్నారు. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్‌ చేసే వారిలో కొందరు పీఆర్వోలు ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ విషయంపై ప్రశ్నలు ఎదురవ్వగా.. దాటవేసినట్లు కనిపించారు.

PRO లు బెదిరిస్తున్నారు... బ్లాక్ మెయిల్ చేసే రేంజ్ కి వెళ్లిపోయారు అని చెప్పారు. మీరు దాని గురించి ఓపెన్ అవ్వాలని అనుకుంటున్నారా?#NagaVamsi Responds#Kingdom #KingdomOnJuly31st #Tupaki pic.twitter.com/dSOkJGqGno

— Tupaki (@tupaki_official) July 30, 2025
Tags:    
  • Nagavamsi 
  • KingdomMovie 
  • VijayDeverakonda 
  • TollywoodNews 
  • PRControversy 
  • MediaRelations 
  • FilmPromotions 
  • TollywoodBuzz 
  • KingdomRelease 
  • CinemaUpdates 
  • Kingdom 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS