వీరమల్లు కోసమే కింగ్ డమ్ ట్రైలర్ లేట్ చేశాం
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ లో ఆయన నిర్మించిన కింగ్ డమ్ మూవీ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే కింగ్ డమ్ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటిపై ఎప్పటికప్పుడు నాగవంశీ క్లారిటీ ఇస్తూ వచ్చారు. అదే సమయంలో ట్రైలర్ కూడా లేట్ గా రిలీజ్ చేశారు. అప్పుడు కూడా పలు వార్తలు రాగా.. ఇప్పుడు వాటిపై రెస్పాండ్ అయ్యారు నాగవంశీ.
"విజయ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా సార్లు తిట్టుకున్నారు. విజయ్ గారు నాకు అడిగారు.. ట్రైలర్ లేట్ అవుతుందని.. అయితే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంది కదా.. దానిని డిస్టర్బ్ చేయకూడదని ట్రైలర్ ను డిలే చేసుకున్నాం. ఆ సినిమా పర్టిక్యులర్స్ పూర్తి అయ్యాక ప్రమోషన్స్ ప్లాన్ చేసుకున్నాం" అని నాగవంశీ తెలిపారు.
"కళ్యాణ్ గారి సినిమా ముందు వారు మూవీ కంటెంట్ తప్ప ఏం ఉండకూడదు అనుకున్నాం. ఆ మూవీకే స్పేస్ ఇచ్చాం. అందుకే అన్నీ డిలే అయ్యాయి" అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా రిలీజ్ కు ముందే వచ్చిన వార్తలు, రూమర్స్ పై నాగవంశీ క్లారిటీ ఇచ్చేయడం విశేషం.
కాగా.. కింగ్ డమ్ మూవీని శ్రీకర స్డూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నాగవంశీ.. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలెంటెడ్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
అయితే మేకర్స్ ట్రైలర్ ను డిలే చేసినా.. ఆడియన్స్ లో వేరే లెవెల్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. కచ్చితంగా సినిమా చూడాలానేంతగా బజ్ సృష్టించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేసేలా చేశారు. మరి కింగ్ డమ్ ఎలాంటి హిట్ అవుతుందో.. నాగవంశీతోపాటు విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి.