• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర ముందు నువ్వెంత?:...

దేవర ముందు నువ్వెంత?: నాగవంశీ

| టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'.

By - Tupaki Desk
Update: 2024-05-16 06:03 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా రిలీజ్ కానుంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా వస్తున్న 'దేవర పార్ట్-1' షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మే19వ తేదీన 'ఫియర్ సాంగ్' (Fear Song) పేరుతో ఈ పాట రిలీజ్ కానుంది. అందుకు సంబంధించి రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా 'ఫియర్ సాంగ్' పై నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పటికే 'ఫియర్ సాంగ్' విన్న ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ పాట 'హుకుం' సాంగ్ ను మించి ఉంటుందని వంశీ తెలిపారు. అయితే రజనీకాంత్ జైలర్ మూవీలోని 'హుకుం' సాంగ్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'ఫియర్ సాంగ్'.. ' హుకుం ' పాటను మర్చిపోయేలా చేస్తుందని ట్వీట్ చేసి ఒక్కసారిగా సాంగ్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

'మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ అన్న ఫ్యాన్స్ కు 'దేవర ఫియర్ సాంగ్' పర్ఫెక్ట్ సాంగ్. మీ అందరి కంటే ముందు నేను పాట వినేశాను. నన్ను నమ్మండి. ఇక హుకుం సాంగ్ ను మీరు మర్చిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నెక్స్ట్ లెవల్ మాస్. దేవర ముందు నువ్వెంత' అంటూ సాంగ్ పోస్టర్ షేర్ చేస్తూ ఎక్స్ (ఇంతకు ముందు ట్విట్టర్)లో నాగ వంశీ రాసుకొచ్చారు. ‘దేవర ముంగిట నువ్వెంత’ లైన్‌ తోనే 'ఫియర్ సాంగ్' మొదలవుతుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరాఠీ భామ శ్రుతి మరాఠే కీ రోల్ పోషిస్తోంది. వీరిద్దరూ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

#Devara #FearSong .. The perfect anthem for all the fans eagerly awaiting the MAN OF MASSES @tarak9999 anna! 🤩

Me andari kante mundhu nenu paata vinnanu😜Trust me.. Hukum marchipothaaru.. An @anirudhofficial Next level MASS ❤️‍🔥

Devara Mungita Nuvventha... 🔥🔥 pic.twitter.com/XX8HOWLh8A

— Naga Vamsi (@vamsi84) May 15, 2024
Tags:    
  • Devara 
  • Manofmasses 
  • Tarak 
  • Nagavamshi 
  • Socialmediatweet 
  • Koratalasiva 
  • Anirudhravichandran 
  • Fearsong 
  • Janhvikapoor 
  • Saifalikhan 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS