• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టికెట్ ధరలు.. ఏది...

టికెట్ ధరలు.. ఏది కరెక్టనేది ఎవరూ చెప్పలేం: నాగవంశీ

| తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టికెట్ ధరల విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

By - Tupaki Desk
Update: 2024-12-27 08:26 GMT

టాలీవుడ్ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ.. ఏదైనా బల్లగుద్ది చెప్పినట్లే మాట్లాడుతుంటారు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి చెందిన పలు విషయాలపై స్పందిస్తుంటారు. తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టికెట్ ధరల విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సినీ ప్రియులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం ఏ ప్రొడ్యూసర్ కు కూడా అస్సలు ఉండదని నాగవంశీ తెలిపారు. ఏ నిర్మాత అయినా తన సినిమాకు పెట్టిన ఖర్చు, బయ్యర్లకు అమ్మిన రేటు బట్టి టికెట్ కాస్ట్ ను డిసైడ్ చేసుకుంటారని అన్నారు. తాను నిర్మించిన దేవర సినిమాకు అంత ఖర్చు అయింది కాబట్టి.. ఇంత రేట్ కావాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు.

అదే ధర కావాలని ప్రభుత్వాలను కోరానని తెలిపారు నాగవంశీ. ఆ విధంగా పుష్ప-2 సినిమాకు కూడా నిర్మాతలు పెట్టిన ఖర్చుకు ఎంత ధర న్యాయ చేస్తుందనుకున్నారో అంతే అడిగారని చెప్పారు. ఎవరైనా కూడా సినిమా టికెట్ కాస్ట్ ల విషయంలో ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదని చెప్పలేమని, ఒక్కో మూవీకి ఖర్చు ఒక్కోలా ఉంటుందన్నారు.

టికెట్ ధరల పెంపు వల్ల సినీ ప్రియులను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరని, ఆ ఉద్దేశం ఎవరికీ ఉండదని నాగవంశీ తెలిపారు. ఏడాదిలో రెండు మూడు సినిమాలకే ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. 2024లో మూడు సినిమాలకే రేట్లు పెరిగాయని.. కల్కి, దేవర, పుష్ప-2 మాత్రమేనని సితార బాస్ అన్నారు.

అదే సమయంలో తన అప్‌ కమింగ్‌ ప్రాజెక్ట్‌ ల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ మూవీ మార్చి 28వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పారు. అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ సినిమా స్క్రిప్ట్‌ పనులు కూడా కంప్లీట్ అయినట్లు పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఫ్రీ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేస్తామని, అయితే సమ్మర్ లో ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు తెలిపారు. డాకు మహారాజ్ కథ బాలయ్యను దృష్టిలో పెట్టుకుని రాశారని చెప్పిన నాగవంశీ.. ఆయన మూవీలో డెకాయిట్‌ గా మారే ఎలివేషన్‌ హైలైట్ గా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచారు. బాలయ్య కొత్త లుక్ లో ఉంటారని అన్నారు. నటసింహం సినిమా అంటే చాలు, తమన్‌ కు పూనకాలు వస్తాయంటూ నవ్వేశారు!

Tags:    
  • Nagavamshi 
  • Telanganagovernment 
  • Tickethikes 
  • Benifitshows 
  • Sitharaentertainments 
  • Filmindustry 
  • Tollywood 
  • Tollywoodproducers 
  • Audience 
  • Daakumaharaj 
  • VD12 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS