• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి 2 : అవన్నీ...

కల్కి 2 : అవన్నీ పుకార్లేనన్న అశ్విన్‌

| కల్కి 2898 AD పార్ట్‌ 2 గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించాడు.

By - Tupaki Desk
Update: 2024-08-21 05:08 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 AD చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన కల్కి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సాధారణంగా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ లో సినిమాలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం దాదాపు రెండు నెలల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఆగస్టు 22న ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ తో పాటు అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. కల్కి సీక్వెల్‌ గురించి అప్పుడే ప్రచారం జోరుగా సాగుతోంది.

కల్కి కథ మొత్తం కూడా పార్ట్‌ 2 లో ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు. ఈ సమయంలో సోషల్‌ మీడియాలో కల్కి 2 కథ అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌ రెండో పార్ట్‌ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని, ప్రభాస్‌ టైమ్ ట్రావెల్‌ చేయనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. రెండో పార్ట్‌ లో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర ద్వారా ప్రభాస్‌ పాత్ర గురించి తెలియజేయనున్నారని, సుప్రీమ్‌ యాస్కిన్‌ తో ప్రభాస్ చేసే యుద్దం లో విజయ్ దేవరకొండ పాత్రను కూడా చూడబోతున్నామని తెగ ప్రచారం చేస్తున్నారు.

కల్కి 2898 AD పార్ట్‌ 2 గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించాడు. ఇప్పటి వరకు కల్కి 2 కథ గురించి ఎక్కడ రివీల్‌ చేయలేదు. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకకుండా కథ కోసం పార్ట్‌ 2 వచ్చే వరకు వెయిట్‌ చేయండి అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. పార్ట్‌ 2 కథ ఇప్పటికే ఫైనల్‌ అవ్వడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. బ్యాలెన్స్ వర్క్ ను ఈ ఏడాది చివరి నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2026లో సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ తో పాటు అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు. విజయ్‌ దేవరకొండ, మృణాల్‌, రాజమౌళి, రామ్‌ గోపాల్ వర్మ ఇంకా పలువురు కల్కి లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చి కన్నుల విందు చేశారు. పార్ట్‌ 2 లో కూడా ఇలాంటి గెస్ట్‌ అప్పియరెన్స్ ఉండాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి కల్కి 2 గురించి ఎలాంటి సందడి అయితే లేదు. ప్రభాస్‌ రాజా సాబ్ మరియు ఫౌజీ సినిమాల షూటింగ్స్ పై దృష్టి పెట్టాడు. ఆ సినిమాల తర్వాత కల్కి 2 ఉండే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Nagashwin 
  • Kalki2898AD 
  • Kalkipart2 
  • Vyjayanthimovies 
  • Prabhas 
  • Amitabhbachchan 
  • Kamalhaasan 
  • Socialmedia 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS