కింగ్ ఆ డైరెక్ట‌ర్ కి అడ్వాన్స్ ఇచ్చారా?

తాజాగా అడ్వాన్స్ ఇచ్చిన నేప‌థ్యంలో విజ‌య్ సొంత క‌థ‌ని తెర‌పైకి తెస్తారా? లేకుంటే మ‌రోసారి నాగార్జునే స్టోరీ విష‌యంలో ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి.

Update: 2024-05-23 08:30 GMT

'నా సామి రంగ 'కాంబోని కింగ్ నాగార్జున మ‌రోసారి రిపీట్ చేయ‌బోతున్నారా? క‌మిట్ అయిన చిత్రాల‌తో పాటు విజ‌య్ బిన్నీని మ‌ళ్లీ తెర‌పైకి తెస్తున్నారా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. నాగార్జున హీరోగా విజ‌య్ బిన్ని ద‌ర్శ క‌త్వంలో స‌క్రాంతి కానుకుగా రిలీజ్ అయిన 'నా సామిరంగ' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతికి ప‌ర్పెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచింది. కొరియోగ్రాఫ‌ర్ గా ఉన్న విజ‌య్ ని పిలిచి మరీ నాగ్ ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం క‌ల్పించి చేయించిన చిత్ర‌మిది.

తొలి ప్ర‌య‌త్నంతోనే విజ‌య్ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. మంచి మేక‌ర్ గా గుర్తింపు ద‌క్కించు కున్నాడు. అయితే ఇంత‌వ‌ర‌కూ రెండ‌వ సినిమా ప్ర‌క‌టించింది లేదు. క‌థ‌లు సిద్దంగా ఉన్నా హీరోలంతా బిజీగా ఉండ‌టంతో ద‌ర్శ‌కులంతా ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితులు కళ్ల ముందు క‌నిపిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ రెండ‌వ సినిమా లేట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో నాగార్జున రెండ‌వ సినిమా ఛాన్స్ మ‌ళ్లీ అత‌డికే ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

Read more!

ఇటీవ‌లే విజ‌య్ ని ఆఫీస్ కి పిలిపించి అడ్వాన్స్ కూడా ఇచ్చారుట‌. సినిమా చేద్దాం..రెడీగా ఉండ‌ని ప్రామిస్ చేసారుట‌. అలా ఇద్ద‌రి మ‌ధ్య మ‌రో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. అయితే స్టోరీ ఏంటి? అన్న‌ది తెలియ‌దు. నా సామి రంగ కంటేముందే విజ‌య్ ..నాగార్జున‌కి ఓ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్పారు. కానీ నాగ్ స‌ల‌హా మేర‌కు అప్పుడా క‌థ‌ని ప‌క్క‌న‌బెట్టి తాను ఇచ్చిన క‌థ‌ని డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్ప‌డంతో విజ‌య్ మాట‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేసాడు.

తాజాగా అడ్వాన్స్ ఇచ్చిన నేప‌థ్యంలో విజ‌య్ సొంత క‌థ‌ని తెర‌పైకి తెస్తారా? లేకుంటే మ‌రోసారి నాగార్జునే స్టోరీ విష‌యంలో ఛాన్స్ తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం నాగార్జున శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర' చేస్తున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర మాత్ర‌మే. త్వ‌ర‌లోనే త‌న పార్టు షూటింగ్ కూడా పూర్త‌వుతుంది. అనంత‌రం త‌మిళ ద‌ర్శ‌కుడు న‌వీన్ సినిమా ప‌ట్టాలెక్కించ‌నున్నారు.

Tags:    

Similar News