కింగ్ నాగార్జున‌తో ట‌బు బిజీగా ఉంటే ఈ పుకార్లేంటి?

ఈ వివాదంపై దర్శకుడు ప్రియదర్శన్ ఘాటుగా స్పందిస్తూ అక్షయ్ కుమార్ -టబుల మధ్య ఉన్న వృత్తిపరమైన బంధాన్ని వివరించారు.;

Update: 2026-05-03 06:54 GMT

టాలీవుడ్ క్లాసిక్ పెయిర్ నాగార్జున-టబు చాలా కాలానికి ఓ సినిమాలో క‌లిసి న‌టిస్తుండ‌టం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న #కింగ్100 పైనే అంద‌రి ఫోక‌స్ ఉంది. చాలా గ్యాప్ త‌ర్వాత‌ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరుగుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను టబు అత్యంత ఉత్సాహంగా పూర్తి చేశారు. సెట్‌లో అందరూ ఎంతో జాయ్‌ఫుల్‌గా ఉన్నారని.. నాగ్-టబు కాంబినేషన్ సీన్లు వెండితెరపై పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా వస్తున్నాయని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్. తన వ్యానిటీ వ్యాన్ నుంచి టీమ్ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ -``ఎండ్ ఆఫ్ షెడ్యూల్ 1`` అంటూ టబు తన సంతోషాన్ని షేర్ చేసారు.

అయితే ఒకవైపు టబు షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. మరోవైపు త‌ను న‌టించిన‌ తాజా హిందీ చిత్రం `బూత్ బంగ్లా` విషయంలో వింతైన రూమర్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో టబు పాత్రను కావాలనే తగ్గించారని.. జాతీయ ఉత్త‌మ‌న‌టి డామినేషన్ తట్టుకోలేక హీరో అక్షయ్ కుమార్ తన స్నేహితుడైన‌ దర్శకుడు ప్రియదర్శన్‌ను ఒప్పించి ఆమె సీన్లను కట్ చేయించారని బాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపించాయి. టబు లాంటి సీనియర్ నటి స్క్రీన్ స్పేస్ తగ్గిపోవడం వెనుక అక్షయ్ జెలసీ (అసూయ) ఉందనే ప్రచారం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. అగ్ర హీరోల సరసన దశాబ్దాలుగా నటిస్తున్న టబుకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై త‌న‌ అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై దర్శకుడు ప్రియదర్శన్ ఘాటుగా స్పందిస్తూ అక్షయ్ కుమార్ -టబుల మధ్య ఉన్న వృత్తిపరమైన బంధాన్ని వివరించారు. టబు `బూత్ బంగ్లా` విజయాన్ని ఆస్వాధిస్తోంది.. తనపై ఎందుకు ఇలాంటి నెగటివ్ వార్తలు వస్తున్నాయో అర్థం కావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టబుతో తాను ఎనిమిది సినిమాలు చేశానని.. ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకే చెబుతుందని.. అసలు సీనియ‌ర్ న‌టి పాత్రను ఎవరూ ట్రిమ్ చేయలేదని స్పష్టం చేశారు. అక్షయ్ కుమార్ ఎప్పుడూ తన పనిలో జోక్యం చేసుకోడని.. కావాలనే ఎవరో ఈ అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారని సీరియ‌స్ అయ్యారు. నిజానికి టబు పాత్ర లేకుండా ఈ కథలో లాజిక్ లేదని ఆయన ముందే వెల్లడించారు.

అయినా ఇండ‌స్ట్రీలో ట‌బు సీనియ‌ర్ న‌టి. టబుకు నాగార్జున, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి అగ్ర హీరోలతో ఎన్నో ఏళ్లుగా గొప్ప అనుబంధం ఉంది. ఈ వయస్సులో.. ఇంతటి అనుభవం ఉన్న నటి విషయంలో అక్షయ్ జెలసీగా ఫీలవుతారనే వార్తల్లో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం థియేటర్లలో రన్ అవుతున్న `బూత్ బంగ్లా` చిత్రానికి మరింత హైప్ లేదా మైలేజ్ పెంచడం కోసమే ఎవరో కావాలని ఈ రూమర్లను తెరపైకి తెచ్చారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా.. టబు తన ప్రొఫెషనల్ లైఫ్ విష‌యంలో చాలా స్పష్టతతో ఉన్నారు.

ప్రస్తుతం `బూత్ బంగ్లా` బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. అదే సమయంలో టబు తెలుగులో నాగార్జునతో కలిసి చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే చిత్రాలతో వెండితెరను మురిపించిన ఈ జోడీ 28 ఏళ్ల తర్వాత `కింగ్ 100`లో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. ఇలాంటి రూమర్లు ఎన్ని ఉన్నా.. టబు మాత్రం తనదైన స్టైల్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూ నేటితరం నటీమణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News