నాగార్జున-కమ్ములా కాంబినేషన్ లో మరో సినిమా!
శేఖర్ కమ్ములా దర్శకత్వంలో తెరకెక్కిన `కుబేర` గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.;
శేఖర్ కమ్ములా దర్శకత్వంలో తెరకెక్కిన `కుబేర` గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రలో మెప్పించారు. ఆయన పాత్రకు మంచి పేరొచ్చింది. కింగ్ మాత్రమే ఆ పాత్రకు న్యా యం చేయగలరని చాటి చెప్పారు. కమ్ములా అవకాశం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైంది. గ్రాండ్ గా సక్సస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాగార్జున శేఖర్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఉందన్న ఆసక్తిని వ్యక్తం చేసారు.
నాగార్జున ఇంత ఓపెన్ గా ఏ దర్శకుడి విషయంలో ఇలా మాట్లాడలేదు. సీని యర్ హీరోల్లో నాగార్జున ఒకరు. హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంతో మంది దర్శకులతో పనిచేసారు. ఆయనతో పని చేయాలని ఎదు రుచూస్తోన్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఏడాది కాలంలో ఎంతో మంది కథలు విన్నారు. వాటిలో కొన్ని నచ్చాయి...మరికొన్ని నచ్చక రిజెక్ట్ అయ్యాయి. వీళ్లందరిని పక్కనబెట్టి మరీ నాగార్జున కమ్ములా పేరు చెప్పారంటే? శేఖర్ చిత్రాలను కింగ్ ఎంతగా లైక్ చేస్తున్నారు? అన్నది అద్దం పడుతుంది.
ఆయన దర్శకత్వంలో నాగ్ హీరోగా చేయాలని భావిస్తున్నారు. నాగార్జున ఓపెన్ అయిపోయారు కాబట్టి ఇక ఆ ఛాన్స్ తీసుకోవాల్సింది కమ్ములా మాత్రమే. నాగ్ తో సినిమా చేయాలా? వద్దా? అన్నది కమ్ములా తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. నాగార్జున తర్వాత చిత్రం తమిళ దర్శకుడు కార్తీక్ తో ఉంటుంది. కార్తీక్ తో ఎంతో కాలంగా జరుగుతోన్న చర్చలకు ఇటీవల పుల్ స్టాప్ పడింది.
దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోయినా కార్తీక్ వినిపించిన స్టోరీ నచ్చడంతో నాగ్ ముందుకెళ్తున్నారు. ఈసినిమా పూర్తయ్యే లోపు శేఖర్ కమ్ములా కూడా నాగ్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలి. శేఖర్ కమ్ములా తర్వాత సినిమా ఏ హీరోతో చేస్తారు? అన్నది ఇంకా ప్రకటించలేదు. సినిమా-సినిమాకి కమ్ములా చాలా గ్యాప్ తీసుకుంటారు. ఇప్పట్లో హీరో విషయం తెలిసే అవకాశం లేదు. ఆ హీరో నాగార్జున అవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.