• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : పుడింగి...

బిగ్ బాస్ 8 : పుడింగి ప్రేరణపై సీరియస్ అయిన నాగ్..!

| ముఖ్యంగా శనివారం ఎపిసోడ్ మీద ప్రేరణ మీద నాగార్జున ఫైర్ అయ్యారు. ఆమె నయని పావనిని పుడింగి అనడమే కాకుండా నిఖిల్ తో బీబీ ఇంటికి దారేదిలోని పాని పట్టు టాస్క్ లో ఆమె ఎఫ్ వర్డ్ వాడింది.

By - Tupaki Desk
Update: 2024-11-03 04:09 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో వీకెండ్ ఎపిసోడ్ లో మొదటిది అంటే శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మెట్స్ మీద సీరియస్ అయ్యారు. ఎంత ఆటలో ఉన్నా కూడా ఇతర హౌస్ మేట్స్ ని డిస్ రెస్పెక్ట్ తో మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నాడు. ముఖ్యంగా శనివారం ఎపిసోడ్ మీద ప్రేరణ మీద నాగార్జున ఫైర్ అయ్యారు. ఆమె నయని పావనిని పుడింగి అనడమే కాకుండా నిఖిల్ తో బీబీ ఇంటికి దారేదిలోని పాని పట్టు టాస్క్ లో ఆమె ఎఫ్ వర్డ్ వాడింది. దానికి కూడా ప్రేరణకి క్లాస్ పీకాడు నాగార్జున.

ఆట బాగా ఆడుతున్నాం కదా మనం ఏం చేసినా కరెక్ట్ అవుతుందని అనుకుంటే పొరబడినట్టే.. బయట ఆడియన్స్ మీ మీద ఒక ఆలోచనకి వచ్చేస్తారు అంటూ నాగార్జున సీరియస్ అయ్యారు. అంతేకాదు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు తీసుకోలేనప్పుడు మిగతా వారిని ఎలా అంటావ్ అంటూ కడిగేశారు. ప్రేరణకి ఒక రేంజ్ లో క్లాస్ ఇచ్చిన నాగార్జున నిఖిల్ పై కూడా నిన్ను ఎవరైనా ట్రిగర్ చేస్తే అలా చేస్తావా అని అతన్ని కూడా మందలించారు.

మరోపక్క నిఖిల్ ని గౌతం కేవలం పెదాలు మాత్రమే ఆడించి అన్న మాటలపై నాగార్జున ప్రస్తావించారు. గౌతం అక్కడ ఏదో అనకూడని మాటే అన్నాడని హౌస్ మెట్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఐతే నిఖిల్ మాత్రం ఒకవేళ అమ్మని అని ఉంటే ఎవరికైనా అమ్మ అమ్మే కదా అని అన్నాడు. ఐతే గౌతం మాత్రం తాను ఏమి అనలేదని చెప్పాడు. ఇక మెగా చీఫ్ గా ఎంపికైన అవినాష్ ని అతని ఆటని పొగిడిన నాగ్ తేజని కూడా మెచ్చుకున్నారు.

ఇక నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో తేజ ఒక్కడు మాత్రమే శనివారం సేవ్ అయ్యాడు. మిగతా నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతాడన్నది ఈరోజు తెలుస్తుంది. హరితేజ ఆటని మెచ్చుకున్న నాగ్ రోహిణి ఆట బాగా ఆడినా ఎల్లో టీం ఒక్క టాస్క్ కూడా గెలవలేదని జాగ్రత్త చెప్పాడు. ఇక నబీల్ అవినాష్ కోసం ఎందుకు సాక్రిఫైజ్ చేశావ్ అంటూ అడిగిన నాగ్ మీ క్లాన్ గెలవాలని అప్పుడు అన్నావ్ కదా అంటే ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారని హర్ట్ అయ్యి అవినాష్ మీద లైట్ గా ఆడినట్టు చెప్పాడు. యష్మిని కూడా యాపిల్ టాస్క్ లో ఆమె చేసిన చీటింగ్ వీడియో చూపించి ఆమె ఎలా ఫ్లిప్ చేస్తుందో అని బయట పెట్టాడు.

మొత్తానికి శనివారం ఎపిసోడ్ నాగార్జున హోస్టింగ్ అదిరిపోయింది. కంటెస్టెంట్స్ అందరికీ వారి ఆటతో పాటు కొంత క్లాస్ కూడా పీకాడు నాగార్జున. ఇక మరోపక్క ప్రేరణ కాస్త డల్ అయ్యిందని గుర్తించిన నాగ్ ఆమె చెప్పిన డేటింగ్ గురించి ప్రస్తావించి ఆమెను నవ్వుతూ ఉండమని చెప్పాడు.

Tags:    
  • Biggboss8 
  • Prerana 
  • Nagarjuna 
  • Teluguseason8 
  • Nikhil 
  • Nayanipavani 
  • Tastyteja 
  • Avinash 
  • Yashmi 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS