శేఖర్ కమ్ములాపై నాగార్జున మనసులో మాట!
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఆయన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.;
స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా ఆయన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలు విజయాలు సాధించినవే. శేఖర్ తో సినిమా అంటే ఆ నటుడికి ఇమేజ్ అవసరం లేదు. తన కథాబలంతోనే ఆ నటుడికి ఓ ఇమేజ్ కి తీసుకు రాగల నటుడు. మార్కెట్ లో కమ్ములా అంటే ఓ బ్రాండెండ్ డైరెక్టర్ గా ముద్ర పడి పోయారు.
ఆ ఇమేజ్ తోనే హీరోకి గుర్తింపు దక్కుతుంది. శేఖర్ కమ్ములా కూడా చాలా సెలక్టెడ్ హీరోలతోనే పని చేస్తుంటారు. హీరోలందరితోనూ పనిచేయరు. కానీ ఆయనతో మాత్రం హీరోలంతా పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. ఇంతకాలం పెదవి దాటని నాగ్ మనసులో మాట తొలిసారి పెదవి దాటింది. ప్రస్తుతం శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తోన్న 'కుబేర' సినిమాలో నాగార్జున కీలక పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో ధనుష్ హీరోగానటిస్తున్నాడు. నాగ్ మాత్రం పవర్ పుల్ ఈడీ అధికారి పాత్ర పో షిస్తున్నారు. ఆ పాత్రను కమ్ములా మార్క్ రేంజ్ లో డిజైన చేసారని ప్రచార చిత్రాలతోనే అర్దమవుతుంది. హీరో పాత్రకు ధీటుగా నాగార్జున పాత్ర కనిపిస్తుంది. ఈసినిమా ప్రచారంలో భాగంగానే కమ్ములాతో 15 ఏళ్ల కాలంగా పనిచేయాలనుకుంటోన్న విషయాన్ని రివీల్ చేసారు. అందుకే `కుభేర` గురించి చెప్పగానే మరో మాట లేకుండా వెంటనే అంగీకరిచినట్లు తెలిపారు.
సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఉన్నారు. కానీ శేఖర్ కమ్ములా రాసుకున్న పాత్రకు కేవలం నాగార్జున అయితేనే సరితూగుతారని ఆయన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ సీనియర్లు ఎవరికీ రాని అవకాశం నాగార్జునకు వచ్చింది. అయితే నాగార్జున హీరోగా శేఖర్ కమ్ములా ఓ సోలో చిత్రం తీయాలని అభిమానులు కోరుతున్నారు. శేఖర్ కమ్ములా తలుచుకుంటే అదేం పెద్ద విషయం కాదు.