బిగ్‌బాస్ హోస్ట్ పై క్లారిటీ
బుల్లి తెర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.;
బుల్లి తెర సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే తొమ్మిదో సీజన్ కు ముస్తాబు కానుంది. అయితే బిగ్ బాస్ ప్రతీ సీజన్ మొదలయ్యే ముందు వచ్చేట్టే ఈ సారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గురించి వార్తలొస్తున్నాయి. ఈసారి నాగార్జున బదులు బాలకృష్ణ బిగ్ బాస్ ను హోస్ట్ చేయనున్నాడని గత కొన్నాళ్లుగా ప్రచారమవుతున్నాయి.
అయితే తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చింది. బిగ్‌బాస్ హోస్ట్ గా బాలయ్య వస్తాడనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, మరోసారి కూడా బిగ్ బాస్ షో ను నాగార్జునే హోస్ట్ చేస్తాడని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 9 కోసం నాగార్జున ఆల్రెడీ కమిట్‌మెంట్ ఇచ్చారని, నాగ్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా షో నిర్వాహకులు తలూపారని సమాచారం.
దీంతో బిగ్‌బాస్ 9వ సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా కంటిన్యూ అవుతారని క్లారిటీ వచ్చేసింది. అన్‌స్టాపబుల్ షో తో బాలయ్య యాంకర్ గా సత్తా చాటి అందరినీ అలరించడంతో నాగ్ ప్లేస్ లో బాలయ్యను తీసుకుంటారని, నాగార్జున పలు సినిమాల కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఈసారి బిగ్‌బాస్ ను హోస్ట్ చేయలేడని ఎన్నో రకాల వార్తలొచ్చినప్పటికీ ఇప్పుడు అవన్నీ పుకార్లేనని తేలింది.
సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మొదలవనుందని తెలుస్తోంది. ప్రతీ సీజన్ లో కొత్తదనాన్ని జోడిస్తూ ఆడియన్స్ ను మరింత అలరిస్తున్న బిగ్ బాస్ ఈసారి ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి. కాగా బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ మొదలుపెట్టగా, రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు నాగార్జునే ఈ షో ను సక్సెస్‌ఫుల్ గా నడిపిస్తూ వస్తున్నాడు.