ట్రెండింగ్ లో నిన్నే పెళ్లాడతా.. ఫాన్స్ చేసిన పని.. నోట మాట రాలేదంటున్న నాగ్!
ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది నిన్నే పెళ్ళాడతా సినిమా.. అందులోనూ ఫ్యాన్స్ చేసిన పనికి.. ఈ సినిమా వచ్చి దాదాపు 29 సంవత్సరాలైనా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అని చెప్పడంలో సందేహం లేదు.;
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ట్రెండ్ కు తెర లేపింది మాత్రం మహేష్ బాబు అభిమానులు అనే చెప్పాలి. గత కొంతకాలంగా ఆయన స్ట్రెయిట్ సినిమాలు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలను మళ్లీ 4k వెర్షన్లో తెరపైకి తీసుకొస్తూ ఆనందం పొందుతున్నారు. అయితే ఈ అభిమానులు అక్కడితో ఆగిపోలేదు. ఆ సినిమాలలోని సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ట్రెండింగ్ లో నిలిచింది నిన్నే పెళ్ళాడతా సినిమా.. అందులోనూ ఫ్యాన్స్ చేసిన పనికి.. ఈ సినిమా వచ్చి దాదాపు 29 సంవత్సరాలైనా ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారంటే.. ఇక ఈ మ్యూజిక్.. ఈ పాటలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదికి ఈ సినిమా 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు ఈ సినిమాను గుర్తు చేసుకోవడమే కాదు ఈ సినిమా కోసం చేసిన పని చూసి హీరో నాగార్జున సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున, టబు కాంబినేషన్లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడతా సినిమా ఈ ఏడాదికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అటు చిత్ర బృందం ఇటు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా.. ఒకచోట గుమిగూడి పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. అందులో "ఎటో వెళ్లిపోయింది మనసు" అంటూ పాటను ప్రదర్శించారు. ఈ సినిమాపై ప్రేమను అలా చూపిస్తూ అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త ట్రెండింగ్లో నిలిచింది. అయితే ఈ విషయం నాగార్జున వరకు చేరడంతో.. ఆయన స్వయంగా దీనిపై స్పందించడం మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.
బృందానికి చెందిన వీడియోని నాగార్జున తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.." అభిమానుల శక్తి అత్యద్భుతమైనది. అభిమానులు కలిసి వచ్చినప్పుడు ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. ముఖ్యంగా ఈ అనుభవాన్ని వివరించడానికి నోట మాట రావడం లేదు" అంటూ ఆయన తెలిపారు. ఇది కేవలం జ్ఞాపకాల గురించి మాత్రమే కాదు ఉమ్మడి జ్ఞాపకాలను గౌరవించడం గురించి కూడా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం వచ్చి 29 ఏళ్లు అవుతున్నా.. ఇంకా దీనిపై అభిమానుల ప్రేమ ఆకాశాన్ని తాకింది అని చెప్పవచ్చు.
నిన్నే పెళ్ళాడతా మూవీ విషయానికొస్తే.. 1996 అక్టోబర్ 4వ తేదీన విడుదలైంది . కృష్ణవంశీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, టబు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే చలపతిరావు, లక్ష్మి, అనిత, గిరిబాబు , చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ , బెనర్జీ, జీవా , మల్లికా,పృధ్వీరాజ్, రవితేజ, మంజు భార్గవి ఇలా చాలామంది ఇందులో భాగమయ్యారు. ఈ సినిమాలోని ప్రతిపాట ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యానికి.. రాజేష్ కృష్ణన్ గానం.. ఎటో వెళ్లిపోయింది మనసు పాటను ఇప్పటికీ మారుమ్రోగేలా చేస్తోంది. అప్పట్లోనే 39 కేంద్రాలలో వంద రోజులు, నాలుగు కేంద్రాలలో 175 రోజులు ఆడి 12 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. నాగార్జున కెరియర్ లోనే మొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా నిలిచిపోయింది.