• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ANR వ్యాలెట్ లో డబ్బులు...

ANR వ్యాలెట్ లో డబ్బులు కొట్టేసిన నాగార్జున!

| భారత అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ అందుకున్న అతి తక్కువ మందిలో ఒకరిగా నిలిచి సత్తా చాటారు.

By - Tupaki Desk
Update: 2025-06-16 08:10 GMT

టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల వయసులోనే తెరంగేట్రం చేసిన ఆయన.. తుది శ్వాస వరకు కూడా (2014) సినిమాల్లో నటించారు. తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించారు.

భారత అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, పద్మశ్రీ అందుకున్న అతి తక్కువ మందిలో ఒకరిగా నిలిచి సత్తా చాటారు. అయితే నాగేశ్వరరావు బాటలోనే కింగ్ నాగార్జున పయనించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఫారిన్‌ లో చదువు పూర్తి చేసుకున్న ఆయన.. విక్రమ్ మూవీతో హీరోగా మారారు.

ఆ తర్వాత మన్మథుడు అనే ట్యాగ్ తో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో హిట్లు అందుకుని సత్తా చాటారు. ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో వివిధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు నాగార్జున.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి లీడ్ రోల్ లో నటించారు నాగ్. ఆఫీసర్ గా.. ధనవంతుడిగా కనిపంచనున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జునతో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో పలు ప్రశ్నలు అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యాలెట్ నుంచి డబ్బులు దొంగతనం చేశారా అని సుమ అడగ్గా.. చేశాను అని నాగ్ చెప్పారు. డబ్బు సంపాదించాలంటే ఉండకూడని లక్షణాలేంటని అడగ్గా.. ఆశ, బద్ధకమని చెప్పారు. ప్రెజెంట్ జనరేషన్ కు మీరు ఇచ్చే సలహా ఏంటని అడిగితే.. అంతా ఫోన్ చూడడం ఆపండని తెలిపారు. చాలా మందిలానే మీరు కూడా తండ్రి ప్యాకెట్ లో మనీ కొట్టేశారా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

కాగా, కుబేరతో జూన్ 20వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్న నాగార్జున.. ఆ తర్వాత కూలీ మూవీతో రానున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా.. ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఆ మూవీలో నాగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి కుబేర, కూలీ మూవీలతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • Nagarjuna 
  • AkkineniNagarjuna 
  • KuberaaMovie 
  • Tollywood 
  • AnchorSuma 
  • PreReleaseEvent 
  • TeluguCinema 
  • Rajinikanth 
  • LokeshKanagaraj 
  • CoolieMovie 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS