నాగార్జున- జాకీ ష్రాఫ్ మధ్య ఈ కనెక్షన్ గురించి తెలుసా?
అయితే కింగ్ నాగార్జున నటుడు ఎలా అయ్యారు? ఆయన మొదటి సినిమా ఎంపిక వెనుక ఎవరున్నారు? అతడికి బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తో ఉన్న కనెక్షన్ ఏమిటి?;
అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా కింగ్ నాగార్జున తన తండ్రి లెగసీని ముందుకు నడిపించడంలో విజయవంతం అయ్యారు. నేడు టాలీవుడ్ మూల స్థంభాలలో ఆయన ఒకరు. అగ్ర కథానాయకుడిగా దశాబ్ధాల పాటు పరిశ్రమను ఏలిన నాగార్జున సినీనిర్మాతగాను తనదైన ముద్ర వేసారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా విజయవంతమైన వ్యాపారవేత్తగా, ఎంటర్ ప్రెన్యూర్ గాను సత్తా చాటారు.
అయితే కింగ్ నాగార్జున నటుడు ఎలా అయ్యారు? ఆయన మొదటి సినిమా ఎంపిక వెనుక ఎవరున్నారు? అతడికి బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తో ఉన్న కనెక్షన్ ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే అభిమానులకు నిజంగా బిగ్ సర్ ప్రైజ్. అసలు నాగార్జున `విక్రమ్` సినిమాని ఎంపిక చేసినది - అక్కినేని నాగేశ్వరరావు. ఇదే సినిమాతో బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ కూడా డెబ్యూ నటుడిగా ఆరంగేట్రం చేసాడు. ఒకే సమయంలో ఒకేసారి నాగార్జున, జాకీ ష్రాఫ్ ఆరంగేట్రం చేయడం అప్పట్లో ఒక పెద్ద విషయం. ఎయిటీస్ క్లాస్ హీరోల్లో ఇప్పటికీ జాకీ ష్రాఫ్ నాగార్జునకు కనెక్ట్ అయి ఉన్నారు. అతడు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి నటులకు అత్యంత సన్నిహితుడు.
కింగ్ నాగార్జునకు `విక్రమ్` సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత అతడు మజ్ను, జానకి రాముడు, విక్కీ దాదా లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. రామ్ గోపాల్ వర్మతో `శివ` సినిమా ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్జీవీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున స్వయంగా అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం దర్శకహీరోలిద్దరికీ బిగ్ బ్రేక్ నిచ్చింది.
కెరీర్ ఆరంభం ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న నాగార్జున, జాకీ ష్రాఫ్ వారు ఎంపిక చేసుకున్న క్రాఫ్ట్ లో మాస్టర్స్ అయ్యారు. ఇద్దరూ ప్రయోగాత్మక పంథాలో కెరీర్ ని నడిపించారు. జాకీ ష్రాఫ్ సహాయనటుడిగా, హీరోగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. ఒక నటవారసుడిగా తెరంగేట్రం చేసినా నాగార్జున ప్రయోగాల బాటలో తనదైన మార్క్ వేస్తూ ఇండస్ట్రీ బెస్ట్ హీరోగా నిరూపించారు.