పూరీ- సేతుపతి సినిమాలో గెస్ట్ రోల్ లో టాలీవుడ్ హీరో
వరుస డిజాస్టర్ల తర్వాత సేతుపతితో చేయబోయే సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు పూరీ.;
ఒకప్పుడు వరుస పెట్టి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ గత కొన్ని సినిమాలుగా ట్రాక్ లో లేడు. పూరీ ఆఖరిగా హిట్ అందుకుని ఐదేళ్లవుతుంది. రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న పూరీ జగన్నాథ్ అప్పట్నుంచి ఇప్పటివరకు మరో హిట్ ను అందుకున్నది లేదు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ బడ్జెగ్‌లో విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తీసినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను రామ్ తోనే తీశాడు. భారీ అంచనాలతో రిలీజైన డబుల్ ఇస్మార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో పూరీ కు నెక్ట్స్ ఛాన్స్ ఎవరిస్తారా అని అందరూ డైలమాలో పడ్డారు.
సరిగ్గా అదే టైమ్ లో పూరీ, కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతితో సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. వరుస డిజాస్టర్ల తర్వాత సేతుపతితో చేయబోయే సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు పూరీ. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, బెగ్గర్ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ పాత్ర కోసం పూరీ బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బెగ్గర్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ స్టార్ క్యామియో ఉండబోతుందని సమాచారం.
ఆ క్యామియోను అక్కినేని నాగార్జునతో చేయించాలని పూరీ ట్రై చేస్తున్నాడట. గతంలో పూరీ- నాగ్ కాంబినేషన్ లో సూపర్, శివమణి సినిమాలు రాగా ఇప్పుడు సేతుపతి సినిమాలో గెస్ట్ రోల్ కోసం నాగ్ తో మరోసారి పూరీ జత కట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా మొత్తానికి ఈసారి పూరీ బెగ్గర్ కోసం చాలా కొత్తగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.