కుబేర.. నాగ్ త్యాగం గొప్పదే..

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర.;

Update: 2025-06-20 18:05 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమా కుబేర. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ లో నటించగా.. జిమ్‌ సర్బ్‌, దిలీప్‌ తాహిల్, షాయాజీ షిండే తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొనగా.. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అందుకు కారణం ప్రమోషనల్ కంటెంట్. మేకర్స్ ఇచ్చిన ప్రతీ అప్డేట్ కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకుని మంచి బజ్ క్రియేట్ చేసింది. అదే సమయంలో నాగార్జున.. సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ప్రతి ఒక్కరి దృష్టి కుబేరపై పడింది.

ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా అదిరిపోయిందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో నాగార్జున పాత్రను ప్రస్తావిస్తున్నారు. సీబీఐ ఆఫీసర్ గా కనిపించిన ఆయన.. తన రోల్ లో అదరగొట్టేశారని కొనియాడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. జీవించేశారని నెటిజన్లు చెబుతున్నారు.

అలా నాగ్ రోల్.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీపక్‌ పాత్రలో నాగార్జున రెండు కోణాల్లో కనిపించడం విశేషం. స్టార్టింగ్ లో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. ఆ తర్వాత పాజిటివ్ షేడ్స్ లో సందడి చేస్తారు. నిజానికి.. తెలుగు టాప్ హీరో అయిన ఆయన.. సినిమాలో హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే గ్రేట్.

టాప్ హీరోగా సినిమాలు చేస్తున్న ఆయన.. ఇలాంటి సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం సినిమా పట్ల ఉన్న అంకితభావానికి అద్దం పడుతుంది. సినిమా కోసం ఆయన త్యాగం కూడా గొప్పదే. ఏదేమైనా తన రోల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా తన వంతు న్యాయం చేశారు. కథకు అనుగుణంగా తన నటనతో మెప్పించారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే నాగ్ కు రొమాంటిక్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. మన్మధుడు, కింగ్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. కానీ వాటిని దీపక్ రీల్ లో అస్సలు కనపడకుండా నటించారనే చెప్పాలి. అంత సెటిల్డ్ గా చేశారు. డీ గ్లామర్ రోల్ లో మెప్పించారు. కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే భావాలు పలికించారు. కత్తి మీద సాము లాంటి పాత్రలో తనదైన శైలిలో యాక్ట్ చేసి ఫిదా చేశారు. ఎంతైనా నాగ్ టాలెంట్ వేరబ్బా.

Tags:    

Similar News