IFFI 2025 ఉత్సవాలలో నాగార్జున ప్రకటన
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ తెరెక్కించిన కల్ట్ క్లాసిక్ శివ ఇటీవలే 4కేలో రీమాస్టర్ చేసిన వెర్షన్ ని థియేటర్లలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.;
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ తెరెక్కించిన కల్ట్ క్లాసిక్ శివ ఇటీవలే 4కేలో రీమాస్టర్ చేసిన వెర్షన్ ని థియేటర్లలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు దశాబ్ధాలుగా ఈ సినిమాని రిపీటెడ్ గా పలు మాధ్యమాలలో చూసేసినా దాని ప్రభావం లేకుండా, మరోసారి థియేటర్లకు వచ్చి మరీ ఆదరించారు. శివ 4కే వెర్షన్ సంతృప్తికరమైన ఫలితం చూసి ట్రేడ్ కూడా ఆశ్చర్యపోయింది. ఆర్జీవీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ ఎప్పటికీ అదే ఆదరణ పొందుతుందని, భావి తరాల ఫిలింమేకర్స్ కి ఇది ఒక లెస్సన్ గా నిలుస్తుందని ప్రూవ్ అయింది.
శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన టైమ్‌లెస్ ఆడియో ఇప్పటికీ యువహృదయాలను కొల్లగొడుతూనే ఉంది. భారతీయ సినిమా కల్ట్ జానర్ మార్గంలోకి ప్రవేశించడానికి ఆద్యమైన గొప్ప చిత్రం- శివ-4కే వెర్షన్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. IFFI 2025లో మీడియాతో మాట్లాడుతూ.. శివ 4కే వెర్షన్ సినిమాను భారీగా విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నామని కింగ్ నాగార్జున ధృవీకరించారు. 1989లో విడుదలైన శివ చిత్రంలో నాగార్జున, అమల, రఘువరన్ కీలక పాత్రలు పోషించారు. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి సంభాషణలు అందించడమే గాక, ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక, 90లలో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ కల్ట్ స్టేటస్‌ను ఆస్వాధిస్తోంది. నాగార్జున, ఆర్జీవీలకు దేశవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ని తెచ్చిన చిత్రంగా ఇది రికార్డులకెక్కింది.
ఫిలిం జిగటగా అంటుకుపోయింది:
`శివ` రీమాస్టర్డ్ వెర్షన్ అద్భుతంగా ఉందని ఆడియెన్ నుంచి ప్రశంసలు కురిసాయి.. 4కేలో చాలా సినిమాలు ప్రాణం పోసుకోవడం నేను చూస్తున్నానని నాగార్జున అన్నారు. `షోలే`లో నాణెం శబ్దాన్ని కొత్త మార్గంలో వినడానికి ఇష్టపడతానని రమేష్ సిప్పి సర్ తో చెప్పిన విషయాన్ని నాగ్ గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో 50వ సంవత్సరం కాబట్టి `శివ` కంటే ఉత్తమ చిత్రం ఏది ఉంది 4కే కోసం అనేది విశ్లేషించాము. ఇది కల్ట్ క్లాసిక్ ..నిజానికి మా బృందం 2019 కి ముందే పునరుద్ధరణను ప్లాన్ చేయడం ప్రారంభించింది. ఇటీవల వాతావరణం మారిపోతోంది... వేడెక్కిపోతోంది.. అందుకే అప్పుడే మేము ఫిల్మ్‌ను సరిగ్గా డిజిటలైజ్ చేసి భద్రపరచాల్సిన అవసరం ఉందని గ్రహించాము. చివరికి మేము పిక్చర్ నెగటివ్‌లను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు, అవి చాలా జిగటగా ఉన్నాయి.. వాటిని మేం విప్పలేకపోయాము. పొడిగా స్కానింగ్ కోసం చుట్టగలిగేలా చేయడానికి మేము వాటిని నాలుగు నుండి ఐదు రౌండ్ల అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ప్రాసెస్ లో నడపాల్సి వచ్చింది! అని అన్నపూర్ణ బ్యానర్ టెక్నీషియన్ రావు ఒక ప్రెస్ నోట్‌లో వెల్లడించారు. 4K స్కాన్ చివరికి సాధించామని నాగార్జున ఆ తర్వాతి కాలంలో వెల్లడించారు.. కానీ ఫుటేజ్ నిండా బాగా గీతలు, దుమ్ము, చిరిగిన ఫ్రేమ్‌లతో చిక్కుకున్నందున చాలా శ్రమించాల్సి వచ్చింది. మా సాకేంతిక బృందం ఫిల్మ్ ఫ్రేమ్‌ను ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ శుభ్రం చేయాల్సి వచ్చింది.. ఈ ప్రక్రియకు ఎనిమిది నుండి పది నెలలు పట్టిందని కూడా నాగార్జున తెలిపారు. ఆడియోను పరిశీలించినప్పుడు.. సౌండ్ నెగటివ్ రెండు రీళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని కనుగొన్నప్పుడు నిజమైన షాక్ తగిలిందని ఆయన అన్నారు.
నెక్ట్స్ ఏంటి?
కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ - తెలుగు కొత్త సీజన్ ని ముగించే ప్రాసెస్ లో ఉన్నారు. అతడు తదుపరి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు సీరియస్ గా ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది.