'శివ'కు ఫ్లాప్ టాక్..ఆడవాళ్లు చూడరన్నారు: నాగార్జున
"ఆ టైమ్‌లో, ఒకరోజు నేను నాన్నగారు కారులో వెళ్తున్నాం. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు, నేను పక్కన కూర్చున్నాను.;
శివ.. ఇది సినిమా కాదు, ఒక ట్రెండ్‌సెటర్. తెలుగు సినిమా చరిత్రను 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అని డివైడ్ చేసిన కల్ట్ క్లాసిక్. సైకిల్ చైన్ లాగిన ఆ ఒక్క షాట్‌తో ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌నే మార్చేసిన సినిమా ఇది. ఇప్పుడు, 36 ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ మూవీ 4K వెర్షన్‌లో రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా, కింగ్ నాగార్జున, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌లో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా, రిలీజ్ టైమ్‌లో 'శివ'పై వచ్చిన నెగటివ్ టాక్ గురించి నాగార్జున చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నాగార్జున మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా రకాల టాక్స్ వచ్చాయి. సినిమా బాగుందని కొందరు అంటున్నా, మరోవైపు నెగటివ్ బజ్ కూడా గట్టిగానే వచ్చింది. అసలు సినిమాలో కామెడీనే లేదు, ఇది లేదు, అది లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయింది.. అంటూ రకరకాల కామెంట్స్ వినిపించాయి" అని నాగార్జున గుర్తుచేసుకున్నారు.
అప్పటి ట్రెండ్‌కు భిన్నంగా, పూర్తి రా, రస్టిక్ యాక్షన్‌తో సినిమా ఉండటమే ఈ టాక్‌కు కారణమైంది. అంతేకాదు, అప్పట్లో వినిపించిన ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే.. ఈ సినిమా 'ఆడవాళ్ళకి నచ్చదు' అని. ఫుల్ యాక్షన్, వైలెంట్‌గా ఉండటంతో ఇది ఫ్యామిలీస్‌కు, ముఖ్యంగా లేడీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వదని చాలా మంది గట్టిగా వాదించారు. ఇలా సినిమాపై రకరకాల నెగటివ్ టాక్స్ వస్తున్న సమయంలో జరిగిన ఒక మూమెంట్ గురించి నాగార్జున ఎమోషనల్‌గా షేర్ చేసుకున్నారు.
"ఆ టైమ్‌లో, ఒకరోజు నేను నాన్నగారు కారులో వెళ్తున్నాం. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు, నేను పక్కన కూర్చున్నాను. అప్పుడు మేం పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ (స్మశానవాటిక) దాటుతున్నాం. సినిమా గురించి బయట ఇలా రకరకాల టాక్ నడుస్తుండటంతో నేను కొంచెం ఆలోచనలో ఉన్నాను" అని నాగార్జున అన్నారు.
"అప్పుడు నాన్నగారు నా వైపు తిరిగి ఒక్కటే మాట అన్నారు. 'సినిమా చాలా పెద్ద హిట్ రా. నువ్వు చాలా బాగా చేశావ్. ఈ సినిమా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకే తెలీదు' అని చెప్పారు. బయట అందరూ సినిమాపై రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటే, ఇండస్ట్రీ మొత్తం తెలిసిన ఒక లెజెండ్ (ANR) అలా చెప్పడం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని నాగార్జున ఆనాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
నిజంగానే, ANR చెప్పినట్టే జరిగింది. 'ఆడవాళ్లు చూడరు', 'కామెడీ లేదు' అన్న వాళ్లందరి నోళ్లూ మూతపడ్డాయి. 'శివ' కేవలం హిట్ అవ్వడమే కాదు, తెలుగు సినిమాకు కొత్త గ్రామర్ నేర్పిన ఒక 'కల్ట్' క్లాసిక్‌గా, ఒక టెక్నికల్ వండర్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను 4K వెర్షన్‌లో కొత్త జనరేషన్‌కు చూపించడానికి నాగార్జున, వర్మ రెడీ అయ్యారు.