అనీల్- రాజుగారు సినిమాలో హీరో ఆయ‌నా?

యువ సంచ‌ల‌నం అనీల్ రావిపూడితో మ‌రో సినిమా చేస్తాన‌ని ఇటీవ‌లే నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-07-15 22:30 GMT

యువ సంచ‌ల‌నం అనీల్ రావిపూడితో మ‌రో సినిమా చేస్తాన‌ని ఇటీవ‌లే నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఆ సినిమా మొద‌ల‌వుతుంది. అయితే ఇందులో హీరో ఎవ‌రు? ఎలాంటి క‌థ‌తో వ‌స్తారు? కంటెంట్ ఎలా ఉండ‌బోతుంది? ఇలాంటి విష‌యాలేవి రాజుగారు రివీల్ చేయ‌లేదు. కానీ తాజాగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో హీరో కింగ్ నాగార్జున అని తెలిసింది. ఈ చిత్రాన్ని నాగార్జున‌తో నిర్మించాల‌ని దిల్ రాజు ముందు ఫిక్స్ అయ్యారుట‌.

అనంత‌ర‌మే ఇదే చిత్రాన్ని అనీల్ రావిపూడితో చేస్తే బాగుంటుంద‌ని రాజుగారు మైండ్ లోకి వచ్చిందిట‌. నాగార్జున‌తో సినిమా చేయాల‌ని అనీల్ కూడా ఎదురు చూస్తున్నాడు. సీనియ‌ర్ హీరోలైనా వెంక‌టేష్‌, బాల కృష్ణ ని డైరెక్ట‌ర్ చేసాడు అనీల్. ప్ర‌స్తుతం చిరంజీవితో 157వ సినిమాకు అనీల్ ప‌నిచేస్తున్నాడు. అలా ముగ్గురు సీనియ‌ర్ క‌వ‌ర్ అయ్యారు. ఇందులో బ్యాలెన్స్ ఉంది నాగార్జున కావ‌డంతో? ఆయ‌న తో కూడా సినిమా చేస్తే సీనియ‌ర్లు అంద‌రినీ క‌వ‌ర్ చేసిన‌ట్లు ఉంటుంద‌ని అనీల్ కూడా భావిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో రాజుగారు ఐడియాని అనీల్ తో పంచుకుని నాగార్జున‌తో మ‌మేకం అయ్యేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అనీల్ క‌థల విష‌యంలో నేల విడిచి సాము చేయ‌డు. సింపుల్ స్టోరీనే అందంగా...న‌వ్వుకునేలా చెప్ప‌డం అనీల్ ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ అదే జోన‌ర్ లోనివే. నాగార్జున కూడా కామెడీ టైమింగ్ ఉన్న హీరో.

ఈ నేప‌థ్యంలో అనీల్ నాగ్ తో సినిమా తీసినా? అది కామెడీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంద‌ని అశించొచ్చు. ప్ర‌స్తుతం అనీల్ చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది స‌క్రాంతికా కానుక‌గా రిలీజ్ అవుతుంది. అటుపై దిల్ రాజు ప్రాజెక్ట్ లో అనీల్ బిజీ అయ్యే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News