నాగ్ ఈసారి బాగా పెంచేశాడే!
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఈసారి బిగ్‌బాస్ సీజన్ 9 కోసం తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ కు నాగ్ అక్షరాలా రూ.35 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు.;
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు రెడీ అవుతోంది. అయితే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుందని, రెండు హౌస్‌లతో పాటూ సరికొత్త టాస్కులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. స్టార్ మా ఈ విషయాన్ని ఇప్పటికే అనౌన్స్ కూడా చేసింది.
ఈసారి కూడా నాగార్జునే!
భారీ ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఇప్పుడు కొత్త సీజన్ కు రెడీ కాబోతుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ షో ప్రసారం కానుందని అంటున్నారు. గత 6 సీజన్లుగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్9 కు నాగార్జున ఎంత ఛార్జ్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నాగ్ క్రేజ్ బాగా పెరిగిందిగా!
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఈసారి బిగ్‌బాస్ సీజన్ 9 కోసం తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ కు నాగ్ అక్షరాలా రూ.35 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు. గత సీజన్ కు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్న నాగార్జున ఇప్పుడు తన రేటును మరింత పెంచారని, నాగ్ క్రేజ్ ను చూసి షో నిర్వాహకులు కూడా ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.
అయితే ఈ సీజన్ కు హోస్ట్ చేస్తున్నారంటే ఎవరైనా సరే మూడు నెలల టైమ్ ను ఈ షో కోసం కేటాయించాల్సిందేనన్న విషయం తెలిసిందే. అందుకే బిగ్‌బాస్ ను హోస్ట్ చేసినందుకు గానూ నాగ్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వహకులు సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే నాగ్ రెమ్యూనరేషన్ విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ ఈ విషయం ప్రస్తుతం టీవీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.