కింగ్ బర్త్ డేకి కొత్త సినిమా!
కింగ్ నాగార్జున 100వ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అక్కినేని అభిమానులు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్నారు.;
కింగ్ నాగార్జున 100వ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అక్కినేని అభిమానులు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్నారు. 'నా సామి రంగ' తర్వాత నటించిన 'కూలీ', 'కుబేర' చిత్రాల్లో కింగ్ కీలక పాత్రలకే పరిమితమవ్వడంతో? కొత్త ప్రాజెక్ట్ పై ఆసక్తి రెట్టింపు అయింది. ఇప్పటికే సోలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా తమిళ దర్శకుడు రా. కార్తిక్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా పెద్దగా అనుభవం లేకపోయినా? కంటెంట్ పై నమ్మకంతో కింగ్ ముందుకెళ్తోన్న ప్రాజెక్ట్ ఇది. తాజాగా ఈ చిత్రానికి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా 100వ సినిమా:
ఈ నెల 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రాజెక్ట్ వివరాలు రివీల్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఏ రోజు ప్రారంభోత్సవం ఉంటుందన్నది అదే రోజు ప్రకటించే అవకాశం ఉందని అన్న పూర్ణ స్టూడియోస్ వర్గాల నుంచి తెలిసింది. నాగార్జున లుక్ కూడా సిద్దం చేసారుట. అదే రోజు రిలీజ్ చేయాలా? మరో స్పెషల్ డేకి రిలీజ్ చేయాలా? అన్న దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్లోనే నాగ్ నిర్మించనున్నారు. ఈ సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 100వ చి త్రాన్ని ప్రతిష్టాత్మకంగానే ప్లాన్ చేస్తున్నారు.
శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు:
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? ఇతర కీలకపాత్రధారుల వివరాలు తెలియాల్సి ఉంది. నాయికగా బాలీవుడ్ భామను దించే ప్రయత్నాల్లో ఉన్నట్లు గతంలోనే మీడియాలో కథనాలొచ్చాయి. ఆ నటి ఎవరు? అన్నది ఇంకా బటయకు రాలేదు. `కుబేర` కూలీ తో నాగార్జున కొత్త ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే. కుబేరతో గ్రాండ్ సక్సస్ అందుకున్నా? కూలీ మాత్రం అంచనాలు అందుకోలేదనే కథనాలొస్తున్నాయి.
అదే ఉత్సాహంతో ముందుకా:
ఈ నేపథ్యంలో నాగ్ హీరోగానే కొనసాగుతారా? దీపక్, సైమన్ పాత్రల స్పూర్తితో ఆ రకంగానూ కంటున్యూ అవుతారా? అన్నది చూడాలి. హీరోగా మాత్రం ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. `బంగార్రాజు`, `నా సామి రంగ` తర్వాత నాగ్ కి సోలో గా కమర్శియల్ సక్సస్ లు పడని సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సోలో సక్సస్ కోసం నాగ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.