• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతు - సాయి పల్లవి.....

చైతు - సాయి పల్లవి.. తండేల్ లవ్ ట్రీట్

| యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-02-14 06:22 GMT

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు.

చిత్ర యూనిట్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే సినిమాను చాలా రియలిస్టిక్ గా తీస్తున్నట్లు అర్ధమవుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి నేచురల్ గా, తక్కువ మేకప్ తో కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడం కోసం ఒరిజినల్ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందట. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందట. అయితే ఈ సినిమా విజువల్, వీఎఫ్ ఎక్స్ వర్క్స్ ఆ డేట్ కల్లా కంప్లీట్ అవుతాయో లేదో చూడాలి.

మరోవైపు, వాలెంటైన్స్ డే సందర్భంగా తండేల్ మూవీ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపింది. నాగచైతన్య.. సాయి పల్లవితో చేసిన రీల్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "తండేల్ గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది. గ్లింప్స్ లోని డైలాగ్ కు మీరు చేసిన రీల్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. అందుకే మేము కూడా చేశాం" అంటూ చైతూ ట్వీట్ చేశారు. గ్లింప్స్ లో ఉన్న వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే డైలాగ్ కు చేసిన రీల్ లో సాయిపల్లవి ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది.

బతుకుతెరువు కోసం గుజరాత్‌ వీరవల్‌ కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో తండేల్ తెరకెక్కనుంది. ఇందులో నాగ చైతన్య గుజరాత్ సముద్ర తీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారు.

నాగ చైతన్య చివరిగా నటించిన కస్టడీ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాత సినిమా తండేల్ మీదే పెట్టుకున్నారు.

Thrilled with the response for the #Thandel glimpse .. was also heartwarming to see so many of you make your own reels on it .. @Sai_Pallavi92 and I decided to make our own :) celebrate love everyday ! Happy Valentine’s Day from Team #Thandel @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/KaLQT0is5Q

— chaitanya akkineni (@chay_akkineni) February 14, 2024
Tags:    
  • Nagachaitanya 
  • Chandoomondeti 
  • Saipallavi 
  • Thandelmovie 
  • Valentinesday 
  • Thadel 
  • Tollywood 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS