• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగచైతన్య కొత్త కారు.....

నాగచైతన్య కొత్త కారు.. చూస్తేనే దిమ్మతిరిగిపోతోంది

| Porsche 911 GT3RS కారుని నాగ చైతన్య ఏకంగా 3.5 కోట్లకి పైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కారుకి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-05-21 08:33 GMT

అక్కినేని యువ హీరో నాగ చైతన్యకి కార్లు, బైక్స్ అంటే బాగా ఇష్టం అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఖార్లుగా చెప్పబడే లంబోర్గని చైతూ దగ్గర ఉంది. తెలుగు రాష్ట్రాలలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే లంబోర్గని కార్లు ఉన్నాయి. ఈ కారు ధర 4 కోట్ల పైనే ఉంటుంది. అలాగే చాలా కంపెనీలకి చెందిన బ్రాండెడ్ కార్లు నాగ చైతన్య కలెక్షన్స్ లో ఉన్నాయి.

 

ఇప్పుడు మరో ఖరీదైన కారుని చైతూ కొనుగోలు చేశాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్స్ బ్రాండ్ గా గుర్తింపు ఉన్న పోర్స్చే కారుని కొనుగోలు చేసి ఆ క్లబ్ లో చేరాడు. Porsche 911 GT3RS కారుని నాగ చైతన్య ఏకంగా 3.5 కోట్లకి పైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కారుకి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫొటో చూసిన ఫ్యాన్స్ దాన్ని చూస్తేనే దిమ్మతిరిగిపోతోందని, ఇక నడిపోతే ఎలా ఉంటుందో అని అంటున్నారు.

సమయం దొరికినప్పుడల్లా నాగ చైతన్య బైక్ లు, కార్లపై టూర్స్ వెళ్తూ ఉంటాడు. అందుకే అన్ని రకాల బ్రాండెడ్ కార్లు, బైక్స్ ని ఎప్పటికప్పుడు కొనేసి తన గ్యారేజ్ లో పెట్టుకుంటాడు. ఇప్పుడు పోర్స్చే కారు కూడా అతని గ్యారేజ్ లోకి వచ్చి చేరింది. ఇప్పటికే అతని వద్ద ఫెరారీ, ల్యాండ్ రోవర్ మరియు మెర్సిడెస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బేనర్ లో ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని బాన్నివాసు నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మత్స్యకార జీవితాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథని తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా నటిస్తోంది.

ఈ ఏడాది ఆఖరిలో తండేల్ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత కార్తిక్ దండు దర్శకత్వంలో చైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుందంట. విరూపాక్ష మూవీతో సక్సెస్ కొట్టిన కార్తీక్ దండు నాగ చైతన్య కోసం ఎలాంటి కథని సిద్ధం చేసాడనేది తెలియాల్సి ఉంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Nagachaitanya 
  • Porsche911GT3RS 
  • Tollywood 
  • Actor 
  • Socialmediaviral 
  • Brandedcarscollections 
  • Expensiveluxurycars 
  • Chandoomondeti 
  • Thandel 
  • Saipallavi 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS