• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NC24 సర్ ప్రైజ్.. మరోసారి...

NC24 సర్ ప్రైజ్.. మరోసారి సత్తా చూపించేందుకు సిద్ధమైన నాగచైతన్య

| యువసామ్రాట్ నాగచైతన్య ఈమధ్య కాలంలో సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఎంతో భిన్నంగా ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2025-04-26 12:04 GMT

యువసామ్రాట్ నాగచైతన్య ఈమధ్య కాలంలో సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇక తన సినిమాల ద్వారా తెలుగు సినీ స్థాయిని పెంచాలని కొన్ని నెలల క్రితం మాట ఇచ్చారు. తండేల్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని.. థియేటర్స్‌లో ప్రేక్షకుల డబ్బు, టైమ్ వృథా కాకూడదని హామీ ఇచ్చారు. ఇప్పుడు తన కొత్త సినిమా NC24తో ఆ హామీని నిలబెట్టుకునేందుకు 100 శాతం కృషి చేస్తున్నారు.

విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న NC24 సినిమాకు సంబంధించి The Excavation Begins వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే నిజంగానే హాలీవుడ్ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ చేసినట్టు స్పష్టమవుతోంది. భారీగా ప్లానింగ్, రిహార్సల్స్, మినియేచర్ మోడల్స్ సిద్ధం చేయడం వంటి పనులు విదేశీ ప్రమాణాలకు సరిపోయేలా జరిగాయి.

ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ లో మాత్రమే ఇలాంటి బిహైండ్ ది సీన్స్ వర్క్ చూశాం. ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా అదే స్థాయిలో పనిచేస్తోంది అంటే, ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్‌ కోసం ఎంతగా మారిందో స్పష్టమవుతోంది. నాగచైతన్య లుక్, అతని ట్రాన్స్‌ఫార్మేషన్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఉన్న డెడికేషన్ ను చూపిస్తున్నాయి.

డైరెక్టర్, టెక్నికల్ క్రూ తో కలిసి నాగచైతన్య ప్రతీ చిన్న అంశాన్ని కూడా పర్ఫెక్ట్‌గా చేయాలని ఎంత కష్టపడుతున్నారో వీడియోలో కనబడుతోంది. ప్రస్తుతం భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్స్ మన స్థాయిని మరింత పెంచుతాయి.

ఈ గ్రాండ్ ప్రాజెక్టును బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమా ప్రెజెంట్ అవుతోంది. విడుదల చేసిన వీడియో NC24 కథ పట్ల, విజువల్స్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నాగచైతన్య తన నెక్ట్స్ మూవీని తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక సినిమా విడుదలయ్యే వరకూ ఈ క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

After years of crafting, months of planning, and endless hours of rehearsing 🔥#NC24 The Excavation Begins ❤️‍🔥-- https://t.co/7MIBU6uaMQ Brace yourselves for the grand spectacle of a never-before-seen mythical thriller💥Yuvasamrat @chay_akkineni @karthikdandu86 @BvsnP… pic.twitter.com/p7SOMT90Li

— SVCC (@SVCCofficial) April 26, 2025
Tags:    
  • Nagachaitanya 
  • NC24 
  • TeluguCinema 
  • KarthikDandu 
  • NagachaitanyaNC24 
  • NC24TheExcavationBegins 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS