80 కోట్ల నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్.. న‌మ్మొచ్చా?

ఈ శుక్ర‌వారం తెలుగులో ఆస‌క్తిక‌ర చిత్రాలు బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నాయి. ఇటు నాగ‌బంధం, అటు రావు బ‌హ‌దూర్ రెండూ క్రేజీ ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

Update: 2026-07-02 12:45 GMT

ఈ శుక్ర‌వారం తెలుగులో ఆస‌క్తిక‌ర చిత్రాలు బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నాయి. ఇటు నాగ‌బంధం, అటు రావు బ‌హ‌దూర్ రెండూ క్రేజీ ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. వీటిలో నాగ‌బంధం సినిమా అయితే స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. విరాట్ క‌ర్ణ అనే ఒక సినిమా అనుభ‌వం ఉన్న‌ యంగ్ హీరో లీడ్ రోల్ చేసిన‌ ఈ సినిమా మీద నిర్మాతలు ఏకంగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఐతే సినిమాలో భారీత‌నం, విజువ‌ల్స్ చూస్తే ఆ ఖ‌ర్చు ఎక్కువేమీ కాద‌నిపిస్తుంది. కానీ స్టార్లు లేని ఈ సినిమా మీద అంత పెట్టుబ‌డి ఎలా పెట్టారు.. ఈ చిత్రానికి బిజినెస్ ఎలా చేశారు.. బ‌డ్జెట్ రిక‌వ‌రీ ఎలా అనే సందేహాలు అంద‌రినీ వెంటాడుతున్నాయి. ఐతే నిర్మాత‌లు మాత్రం తాము సేఫ్ జోన్లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మూవీ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో నిర్మాత‌ మాట్లాడుతూ.. బ‌డ్జెట్లో 80 శాతం రివ‌క‌రీ నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారానే జ‌రిగిపోయిన‌ట్లు చెప్పారు. థియేట‌ర్ల నుంచి రావాల్సింది 20 శాత‌మే అని చెప్పారు. నాగ‌బంధం బడ్జెట్ రూ.100 కోట్ల‌ని చెప్పింది నిర్మాత‌లే. 80 శాతం రిక‌వ‌రీ నాన్ థియేట్రిక‌ల్స్ నుంచి వ‌చ్చిందంటే ఆ బిజినెస్ రూ.80 కోట్ల మేర జ‌రిగినట్లు భావించాలి. కానీ డిజిట‌ల్ మార్కెట్ ఈ మ‌ధ్య ఎంత‌గా దెబ్బ తిందో.. ఓటీటీలు ఎలా రేట్లు త‌గ్గించేశాయో తెలిసిందే. మ‌రి నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌లో మేజ‌ర్ షేర్ అయిన డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ నుంచి ఈ చిత్రానికి ఎంత వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌శ్న‌. నిర్మాత చెప్పిన ప్ర‌కారం చూస్తే రూ.50-60 కోట్ల‌కు త‌క్కువ కాకుండా స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా వ‌చ్చి ఉండాలి.

విజువల్స్ ఎంత బాగున్నా, కంటెంట్ ఎంత ప్రామిసింగ్‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ స్టార్లు లేని సినిమాకు ఓటీటీ సంస్థ అంత రేటు ఇచ్చిందా అన్న‌ది సందేహ‌మే. మ‌రి నిర్మాత‌ల మాట‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది. నిజంగా థియేట‌ర్ల నుంచి రావాల్సింది రూ.20 కోట్లే అయితే మాత్రం నిర్మాత‌లు ధీమాగా ఉండొచ్చు. నాగ‌బంధం మీద ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆస‌క్తిని బ‌ట్టి చూస్తే రిక‌వ‌రీ క‌ష్ట‌మేం కాక‌పోవ‌చ్చు.

Tags:    

Similar News