నాగవంశీ.. ఆ వీడియో వెనుక అంత అర్థముందా?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే.;

Update: 2025-12-18 03:45 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన సినిమాలతోనే కాకుండా.. కామెంట్స్ తో వైరల్ అవుతుంటారు. వార్తల్లో కూడా నిలుస్తుంటారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారుతూ హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగవంశీ.. తన మనసులోని భావాలను వ్యక్తపరచడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఇప్పుడు ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. నాలుగు ఎమోజీలు మాత్రమే క్యాప్షన్ గా ఇచ్చారు. వాటితో పాటు వీడియోతో తన ఫీలింగ్స్ ను వ్యక్తపరిచినట్లు కనిపిస్తున్నారు. అసలేంటి ఆ వీడియో?.. క్యాప్షన్ ఏంటి ఇచ్చారు?

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు, నటుడు చైతూ జొన్నలగడ్డకు సంబంధించిన ఓ పాడ్ కాస్ట్ వీడియోను నాగవంశీ షేర్ చేశారు. అందులో చైతూ సింపతీ గురించి మాట్లాడారు. పబ్లిక్ కు విక్టిమ్ కావాలని అన్నారు. కరెక్ట్ గా మాట్లాడితే ఆడియన్స్ కు నచ్చదని, కన్నీరు కార్చి మాట్లాడితే నచ్చుతుందని చెప్పారు. చాలా కష్టాలు పడ్డానని చెబితే ఫుల్ గా వింటారని తెలిపారు.

వదిలేయ్ బ్రో వదిలేయ్ బ్రో అంటూ మళ్లీ మళ్లీ సాడ్ స్టోరీసే చెబుతూ ఉంటారని చైతూ జొన్నలగడ్డ అన్నారు. కాస్త కాన్ఫిడెంట్ గా మాట్లాడితే చాలు.. యాటిట్యూడ్ అంటున్నారని చెప్పారు. కేవలం ఎమోషనల్ గా మాట్లాడితే.. ఆడియన్స్ సింపతీ చూపిస్తున్నారని తెలిపారు. అలా తన కామెంట్స్ తో సింపతీ కార్డు వాడే వారికి కౌంటర్లు ఇచ్చారు చైతూ.

అయితే ఇప్పుడు ఆ వీడియో షేర్ చేస్తూ క్లాప్స్ ఎమోజీతోపాటు లాఫింగ్ ఎమోజీలు ఇచ్చారు నాగవంశీ. దీంతో ఆయన.. తన అభిప్రాయాన్ని చైతూ వ్యక్తపరిచారని అనుకున్నట్లు అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే వీడియోను షేర్ చేశారని చెబుతున్నారు. ఎమోషనల్ అవుతుంటేనే సినిమాలపై సింపతీ చూపిస్తున్నారనేది ఆయన అభిప్రాయమేమోనని అంచనా వేస్తున్నారు.

ఇక నాగవంశీ చిత్రాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఆయన నిర్మించిన మాస్ జాతర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు నాగవంశీ నిర్మాణంలో రూపొందుతున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ.. సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దానితోపాటు మరిన్ని చిత్రాలు నిర్మిస్తున్నారు నాగవంశీ.

Tags:    

Similar News