సంక్రాంతి రిలీజ్ వాళ్లకే బెనిఫిట్.. గ్యాప్ లో కొట్టేయోచ్చు: నాగవంశీ
ఒక సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు, ఒక చిన్న సినిమా అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఉన్నా త్వరగానే పరిష్కారం అవుతాయి.;
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగను మేకర్స్ రిలీజ్ సీజన్ గా భావిస్తారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్ లకు సెలవులు ఉండడం, లాంగ్ రన్ దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వారంలో సినిమా విడుదల చేస్తుంటారు. ఇక బడా హీరోల సినిమాలు మ్యాక్సిమమ్ సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ చేస్తుంటారు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి సంక్రాంతి సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ప్రతీ ఒక్కరూ సంక్రాంతికే వస్తే థియేటర్ అడ్జెస్ట్ మెంట్ కష్టంగా మారుతోంది.
ఒక సంక్రాంతికి ఇద్దరు పెద్ద హీరోలు, ఒక చిన్న సినిమా అంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఉన్నా త్వరగానే పరిష్కారం అవుతాయి. కానీ, కొన్నేళ్లుగా టాలీవుడ్ లో పెద్ద హీరోలు సంక్రాంతికే సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకేసారి ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయి. దీనిపై నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గత సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మాహారాజ్ సినిమాల కంటే, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నం బాగా ఆడింది. దీంతో సంక్రాంతికి ప్రేక్షకులు మాస్ కంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లనే ఇష్టపడుతున్నారా? 2026 సంక్రాంతికి కూడా ఫ్యామిలీ సినిమాలే వచ్చే అవకాశం ఉంది. అని ఇంటర్వ్యూలో నాగవంశీని అడిగారు. దీనికి ఈసారి సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే అని నాగవంశీ చెప్పారు.
అసలు పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేయకూడదు. పెద్ద సినిమాలకు అసలు ఓ డేట్ అవసరం లేదు. కల్కి, దేవర, పుష్ప 2 అలా వచ్చినవే. సంక్రాంతికి ఏ సినిమా ఎలా అయిపోద్దో చెప్పలేం. అందుకే ఎంతో కష్టపడి పెద్ద సినిమా తీసి సంక్రాంతి కాంపిటీషన్ లో పెట్టకూడదు. పెద్ద సినిమా ఎప్పుడొచ్చినా, జనాలు చూస్తారు. దీనికి ఉండే ఫ్యాన్స్ దానికి ఉంటారు. అందుకే అవి సోలో రిలీజ్ చేసుకోవాలి.
సంక్రాంతికి మీడియం సినిమాలకే ఎక్కువ అడ్వాంజేట్ ఉంటుంది. మౌత్ టాక్ బాగుంటే నాలుగు రోజులు బాగా ఆడుతుంది. ఈ గ్యాప్ లో దానికి పెట్టిన బడ్జెట్ రికవరీ అయిపోతుంది. ఇదే నేను గత మూడేళ్లలో నేర్చుకున్నది. అని నాగవంశీ సంక్రాంతి కాంపిటీషన్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.