రివ్యూ అనేది ఓ ఫోబియా.. అందులోంచి బయటకు రాలేకపోతున్నా!

టాలీవుడ్ లో డైనమిస్ ప్రొడ్యూసర్లలో సితార నాగవంశీ ఒకరు. తరచూ ఏవో కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు.;

Update: 2025-07-20 17:27 GMT

టాలీవుడ్ లో డైనమిస్ ప్రొడ్యూసర్లలో సితార నాగవంశీ ఒకరు. తరచూ ఏవో కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సినిమా రివ్యూలపై ఆయన పలుమార్లు మాట్లాడారు. రివ్యూలు సినిమాలను కిల్ చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లోనూ రివ్యూలపై ఫైర్ అయ్యాకు. ఆయన సినిమాలకు ఇకపై రివ్యూలు రాయొద్దని కోరారు.

అదే క్రమంలో ఆయన క్వాలిటీ సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంటారు. ఇందులో భాగంగా తాను నిర్మించిన కింగ్ డమ్ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మరోసారి రివ్యూల అంశం చర్చకు వచ్చింది. దీనిపై ఈసారి ఆయన ఏమన్నారంటే?

సినిమా రిలీజ్ కు ముందు రివ్యూ ఎలా రాసినా, రేటింగ్స్ ఎలా ఇచ్చినా పట్టించుకోను అంటారు. నాకు అనవసరం అంటారు. తీరా రిలీజ్ తర్వాత చూస్తే మీడియా, రివ్యూలపై ఫైర్ అవుతుంటారు. అని ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు. దీనికి నాగవంశీ బదులిచ్చారు.

రివ్యూలపై ఫైర్ అవ్వలేదు. అయితే నేను ముందునుంచీ రివ్యూలు పట్టించుకోకూడదు. అది మన సినిమాపై ఎక్కువ ఇంపాక్ట్ చూపించదు కూడా అని అనుకుంటా. కానీ ఓ ఫోబియా లాంటింది ఉంటుంది కదా. దానివల్ల రిలీజ్ రోజు ఆ వెబ్ సైట్ ఎంత రేటింగ్ ఇచ్చింది? ఈ వెబ్ సైట్ రివ్యూ ఎలా రాసింది. అనేది ఐదు ఆరు గంటలు మైండ్ లో తిరుగుతుూ ఉంటుంది. రివ్యూలు సరిగ్గా రాకపోయినా మార్నింగ్, మ్యాట్నీ, ఈవినింగ్, మరుసటి రోజు ఫస్ట్ షో బాగా ఆడితే రివ్యూలు మర్చిపోతాం.

శనివారం డే 1 కలెక్షన్లు చూసిన తర్వాత రేటింగ్ ఐదు ఏసినా, రెండు ఏసినా అది మ్యాటర్ కాదు. కానీ ఆ 8-9 గంటలు ఓ ఫోబియోలో ఉంటాం. అందులోంచి బయటకు రాలేకపోతున్నాం. నేనే అలా ఉంటే, ఆడియెన్స్ పరిస్థితి ఎలా. ప్రేక్షకులు కూడా ఆలోచిస్తున్నారు. సరే ఈసారి కింగ్ డమ్ సినిమా రివ్యూల గురించి అస్సలు మాట్లాడను. అలాగే రివ్యూలపై కూడా ఎక్కువగా మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అని రివ్యూలపై నాగవంశీ తన అభిప్రాయాన్ని చెప్పారు.

కాగా, ఆయన నిర్మించిన కింగ్ డమ్ జూలై 31 రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ- భాగ్య శ్రీ భోర్సే కీలక పాత్రల్లో నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.

Tags:    

Similar News