మూడేళ్ల గ్యాప్ ను ఒకేసారి ఫిల్ చేసేలా!

యంగ్ హీరో నాగశౌర్య `రంగ‌బ‌లి` త‌ర్వాత ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యాడు. అప్ప‌టికే వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న నాగ‌శౌర్య `రంగ‌బ‌లి`పై చాలా ఆశ‌లే పెట్టుకున్నా? ఆ సినిమా ఫ‌లితం కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది.;

Update: 2026-03-29 03:00 GMT

యంగ్ హీరో నాగశౌర్య `రంగ‌బ‌లి` త‌ర్వాత ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యాడు. అప్ప‌టికే వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న నాగ‌శౌర్య `రంగ‌బ‌లి`పై చాలా ఆశ‌లే పెట్టుకున్నా? ఆ సినిమా ఫ‌లితం కూడా తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. దీంతో వ‌స్తే హిట్ సినిమాతోనే తోనే రావాల‌ని బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఏకంగా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడీ గ్యాప్ మొత్తాన్ని ఒకేసారి పుల్ ఫిల్ చేసేలా రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. సాధారణంగా హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తుంటారు.

కానీ నాగ‌శౌర్య మాత్రం ఈ మూడేళ్ల విరామాన్ని కవర్ చేస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఈ మూడు చిత్రాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే యంగ్ హీరో రేయింబవళ్లు కష్టపడుతూ షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. తన కెరీర్‌లో ఇదొక కీలకమైన మలుపు గా భావిస్తున్నాడు. ఈ మూడు సినిమాల్లో క్రేజీ టైటిల్ తో రిలీజ్ అవుతున్న చిత్రం `నారీ నారీ నడుమ మురారి`. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ టైటిల్ తో వ‌చ్చిన రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో? ఈ సినిమాపైనా మంచి బ‌జ్ నెల‌కొంటుంది. అదే సినిమాకు ప్ల‌స్ పాయింట్ గా క‌నిపిస్తుంది.

మ‌రో చిత్రం `పోలీస్ వారి హెచ్చ‌రిక‌`. ఈ సినిమాకు టైటిలే క్యాచీగా ఉంది. అలాగే మ‌రోచిత్రం `బ్యాడ్ బోయ్ కార్తీక్` ఈ మూడు క‌థ‌ల్ని ఎంతో గ్యాప్ తీసుకుని మ‌రీ ఎంచుకున్నాడు. ప‌క్కాగా హిట్ సినిమాలు అవుతాయ‌నే కాన్పెడెంట్ తోనే ముందుకెళ్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ల కోసం ప్ర‌త్యేకంగా మేకోవ‌ర్ అయ్యాడు. ఫిజిక్ , లుక్ విషయంలో కూడా భారీ మార్పులు చేశాడు. మూడు సినిమాల్లోనూ శౌర్య‌ మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఒక సినిమాలో క్లాస్ లుక్‌లో కనిపిస్తే? మరో సినిమాలో పక్కా మాస్ అవతారంలో మెప్పించబోతున్నాడ‌ని తెలుస్తోంది.

హీరోగా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూడు సినిమాల సక్సెస్ అత‌డికి అత్యంత కీల‌కం. అందుకే ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాలు రూపొందుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో మూడేళ్లు కనిపించకపోతే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ నాగశౌర్య తన బ్రాండ్ వాల్యూను పదిలపరుచుకుంటూ ఈ మూడు సినిమాలతో మళ్ళీ టాప్ లీగ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధం నుండి వచ్చే ఏడాది ఆరంభం వరకు వరుసగా శౌర్య సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Tags:    

Similar News