చైతూ 'వృషకర్మ' గ్లింప్స్.. ఇంకా టాప్ లోనే..
యువ సామ్రాట్ నాగచైతన్య లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వృషకర్మపై సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది.;
యువ సామ్రాట్ నాగచైతన్య లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వృషకర్మపై సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. హారర్ థ్రిల్లర్ కు సోషియో ఫాంటసీ అంశాలను యాడ్ చేస్తూ రూపొందుతున్న సినిమా విజువల్ వండర్ గా కూడా ఆకట్టుకుంటుందని గ్లింప్స్ క్లారిటీ ఇచ్చింది.
అయితే గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయ్యి ఐదు రోజులు అవుతున్నా ఇప్పటికే టాప్ ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం. ఈసారి నాగ చైతన్య మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఆయనకు కెరీర్ లో వృషకర్మ ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ ప్రత్యేకంగా చూపిస్తూ మేకర్స్ తాజాగా స్పెషల్ వీడియో విడుదల చేశారు. "వృషకర్మ గ్లింప్స్ కు వచ్చిన స్పందన.. షాక్ కు గురి చేస్తోంది.. ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఆ రెస్పాన్సులు అన్నింటినీ చూడండి" అంటూ నటీనటులు, సినీ విమర్శకులు, ప్రముఖుల అభిప్రాయాలను వీడియో రూపంలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే సినిమాలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుందనే చెప్పాలి.
అదే సమయంలో గ్లింప్స్ లో మొదటి ఫ్రేమ్ నుంచే ఒక మిస్టీరియస్ క్లైమేట్ సృష్టించారు మేకర్స్. చీకటి సన్నివేశాలు, భయానక నేపథ్య సంగీతం, అర్థం కాని సంఘటనలు కలిసి వచ్చి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య పాత్ర సినిమా చాలా సీరియస్ గా, ఇంటెన్స్ గా కనిపిస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా సినిమాలో కనిపించనున్నారని క్లియర్ గా తెలుస్తోంది.
కథలో గ్రామీణ నేపథ్యంలో జరిగే కొన్ని రహస్య ఘటనలు ప్రధానంగా ఉండే అవకాశం ఉందని వినికిడి. గ్రామంలో జరుగుతున్న ఘటనలు, వాటి వెనుక దాగి ఉన్న అజ్ఞాత శక్తులు, వాటిని ఎదుర్కొనే హీరో జర్నీ కీలక భాగంగా ఉండొచ్చని అర్థమవుతోంది. హారర్ అంశాలతో పాటు ఒక సోషల్ మెసేజ్ కథలో భాగమై ఉండొచ్చని సమాచారం. గ్లింప్స్ లోని విజువల్స్, టెక్నికల్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా మూవీ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి వృషకర్మ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.