అక్కినేని కోడ‌లు స్ట‌న్నింగ్ న్యూలుక్

ముఖ్యంగా శోభిత ఎంపిక చేసుకున్న ఎరుపు రంగు సాదా చీర‌, కాంబినేష‌న్ డిజైన‌ర్ గోల్డెన్ బ్లౌజ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.;

Update: 2025-06-11 19:29 GMT

అక్కినేని అఖిల్- జైనాబ్ రావూజీ పెళ్లి వేడుక‌లో అతిథులు, అక్కినేని కుటుంబం మొత్తం ఒకెత్తు అనుకుంటే, నాగార్జున పెద్ద కోడ‌లు శోభిత ధూళిపాల- నాగ‌చైత‌న్య జంట‌ ఆక‌ర్ష‌ణ మ‌రొక ఎత్తు. స్టైలిష్ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న శోభిత ముగ్ధ మ‌నోహ‌రంగా రెడీ అయ్యి పెళ్లి వేడుక ఆద్యంతం క‌నిపించారు. డి-డేతో పాటు, పెళ్లి అనంత‌ర విందులోను, ప్రీవెడ్డింగ్ లోను ర‌క‌ర‌కాల డిజైన‌ర్ చీర‌లు, ఆభ‌ర‌ణాల్లో శోభిత వేష‌ధార‌ణ‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

 

ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌ప‌డ‌ని ఒక కొత్త లుక్ ఒక‌టి ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైరల్ గా మారింది. అక్కినేని నాగ‌చైత‌న్య‌- శోభిత జంట ఎంతో స్టైలిష్ గా పార్టీ కోసం రెడీ అయిన కొన్ని ఫోటోలు వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. చైతూ డార్క్ క‌ల‌ర్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపించ‌గా, శోభిత రెడ్ హాట్ శారీలో అల్ట్రా పోష్ అవ‌తార్ లో క‌నిపించారు.

 

 

ముఖ్యంగా శోభిత ఎంపిక చేసుకున్న ఎరుపు రంగు సాదా చీర‌, కాంబినేష‌న్ డిజైన‌ర్ గోల్డెన్ బ్లౌజ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. అంద‌మైన బ్రీడ్స్, ముత్యాల అల్లిక‌తో డిజైన‌ర్ బ్లౌజ్ శోభిత అందాన్ని ప‌దింత‌లు పెంచింది. సింపుల్ మేక‌ప్, కాటుక క‌ళ్ల‌తో మ్యాజిక్ చేసింది అక్కినేని కోడ‌లు. చై-శోభిత జోడీ షో స్టాప‌ర్స్ గా నిలిచారు అంటే అతిశ‌యోక్తి కాదు. శోభిత చేతిలో ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ కూడా ఆపోజిట్ క‌ల‌ర్ తో ఎర్ర‌ చీర‌కు మ్యాచింగ్ గా క‌నిపించింది. ఇక అక్కినేని వారి ఇంట పెళ్లి సంద‌డి ముగిసింది.. స‌రే కానీ, చైత‌న్య త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? శోభిత కెరీర్ లో నెక్ట్స్ ఏంటి? అంటూ అభిమానులు ప్ర‌స్తుతం ఎగ్జ‌యిటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News