ఫుల్ గా భయపడ్డ చైతూ.. కానీ అఖిల్ మాత్రం..!

సినీ ఇండస్ట్రీలో ఒక కథ విన్న వెంటనే హీరోలు ఉత్సాహంగా ఓకే చెప్పే సందర్భాలు ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం నటులకే సవాల్‌ గా అనిపిస్తాయి.

Update: 2026-07-21 06:27 GMT

సినీ ఇండస్ట్రీలో ఒక కథ విన్న వెంటనే హీరోలు ఉత్సాహంగా ఓకే చెప్పే సందర్భాలు ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం నటులకే సవాల్‌ గా అనిపిస్తాయి. అలాంటి కథే లెనిన్. ఆ విషయాన్ని స్వయంగా నాగచైతన్య చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్ లో చైతూ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సాధారణంగా ఒక సినిమా హిట్ అయిన తర్వాత హీరో యాక్టింగ్, దర్శకుడి వర్కింగ్ స్టైల్ గురించి ప్రశంసలు వినిపిస్తాయి. కానీ లెనిన్ విషయంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ మాత్రం అఖిల్ తీసుకున్న రిస్క్‌ పై ఫోకస్ పడేలా చేశాయి. ఆ కథ మొదటిసారి విన్నప్పుడు తనకే భయం వేసిందని చైతూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఒక నటుడిగా చూస్తే ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా అనుభవం అవసరమని, కనీసం 25 సినిమాలు చేసిన తర్వాత అలాంటి సవాళ్లను యాక్సెప్ట్ చేయాలని తాను భావించానని వెల్లడించారు.

అయితే అఖిల్ మాత్రం ఆలోచనను అక్కడితో ఆపలేదు. కథను నమ్మి ముందడుగు వేశాడు. అదే విషయం నాగచైతన్యను ఎక్కువగా ఆకట్టుకుంది. "కథను అంగీకరించినప్పుడే అఖిల్ నా దృష్టిలో హీరో అయిపోయాడు" అని చైతూ చెప్పడం వెనుక కూడా అదే ఫీలింగ్ కనిపించింది. ఒక పాత్ర ఎంత కష్టమైనదైనా, దాన్ని చేయగలమనే నమ్మకంతో ముందుకు వెళ్లడం అఖిల్ స్పెషాలిటీగా నిలిచిందనే చెప్పాలి.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లెనిన్ సినిమాలో అఖిల్ రోల్ కు రియల్ లైఫ్ పర్సనాలిటీకి సంబంధమే లేదని నాగచైతన్య చెప్పారు. సాధారణంగా నటులు తమ పర్సనాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రల్లో చాలా ఈజీగా ఒదిగిపోతారు. కానీ పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకుని, దానికి తగ్గట్టుగా మారడం అంత తేలిక కాదు. అఖిల్ ఆ సవాల్‌ ను స్వీకరించి, సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తాను దగ్గర నుంచి చూశానని చైతూ పేర్కొన్నారు.

ఆ కామెంట్స్ లో కేవలం ఒక హీరో మరో హీరోను పొగడటం మాత్రమే కాదు, బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్ కూడా స్పష్టంగా కనిపించింది. ఒక అన్నయ్యగా, ఒక అభిమానిగా అఖిల్‌ ను చూస్తుంటే గర్వంగా ఉందని నాగచైతన్య చెప్పడం విశేషం. ఇక అఖిల్ కూడా గతంలో నాగచైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైతూ ఎప్పుడూ తనపై డామనేషన్ చెలాయించే అన్నయ్యలా కాకుండా, మంచి స్నేహితుడిలా ఉంటాడని చెప్పారు.

తన నిర్ణయాలను గౌరవిస్తూ, అవసరమైనప్పుడు సలహాలు ఇస్తాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చైతూ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్ ను మరోసారి బయటపెట్టాయి. అక్కినేని కుటుంబంలో ఒకరి విజయాన్ని మరొకరు తమ విజయంగా భావించడం కొత్త విషయం కాదు. అయితే లెనిన్ విషయంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ అఖిల్ కెరీర్‌ లో ఆ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పేలా ఉన్నాయి. కథ విన్నప్పుడు చైతూ భయపడితే.. అదే కథను నమ్మి ముందుకు వెళ్లిన అఖిల్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నారు.

Tags:    

Similar News