• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెట్ మ‌రీ ఇంత...

సెట్ మ‌రీ ఇంత డీటైలింగ్‌గానా కార్తీక్‌!

| నిధి అన్వేష‌ణ‌తో పాటు వ‌ర్త‌మాన అంశాలతో ముడిప‌డిన క‌థ‌గా దీన్ని ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-05-17 07:19 GMT

అక్కినేని నాగ‌చైత‌న్య స్పీడు పెంచేశాడు. చందూ మొండేటి తెర‌కెక్కించిన `తండేల్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా ఈ సినిమాతో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిన చైతూ ఇక వెనుతిరిగి చూసుకోకూడ‌ద‌ని, స్పీడు పెంచాల‌ని నిర్ణ‌యాంచుకున్నాడు. ఇందులో బాగంగానే `విరూపాక్ష‌` ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ట్రెజ‌ర్ హంట్ మిస్టిక్ థ్రిల్ల‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. చైతూ న‌టిస్తున్న 24వ ప్రాజెక్ట్ ఇది.

`NC24` అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌, ఉకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌ల‌పై బీవీఎస్ ఎన్‌ ప్ర‌సాద్,సుకుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌ర‌బాద్‌లో ప్ర‌త్యేకంగా వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా హ‌ర్యానా సోయ‌గం మీనాక్షీ చౌద‌రి న‌టిస్తోంది. చైతూ ఇందులో ట్రెజ‌ర్ హంట‌ర్‌గా స‌హ‌సోపేత‌యైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఈ మూవీ కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా గుహ సెట్‌ని ఏర్పాటు చేశారు. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ప‌నాగేంద్ర తుంగ‌ల నేతృత్వంలో ఈ సెట్‌ని స‌ర్వాంగ సుంద‌రంగా రూపొందించారు. ఈ గుహ సెట్‌లో గ‌త 18 రోజులుగా షూటింగ్ జ‌రుగ‌తోంది. `విరూపాక్ష‌`లోని ప్ర‌తి అంశాన్ని చాలా డీటైలింగ్‌గా సిద్ధం చేసి సూప‌ర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు తాజా మూవీ కోసం వేసిన గుహ సెట్ విష‌యంలోనూ ప్ర‌తి చిన్న డీటైలింగ్‌ని కూడా వ‌ద‌ల‌కుండా ఏర్పాటు చేయించిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.

ఈ సెట్ కోసం టీమ్ అంతా రెండు నెల‌లు వర్క్ చేసింద‌ట‌. సెట్ రియ‌ల్‌గా క‌నిపించాల‌ని ఇందు కోసం ప్ర‌తి చిన్న బిట్‌ని కూడా వ‌ద‌ల‌కుండా చాలా అథెంటిక్‌గా క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సెట్‌లోనే షూటింగ్ జ‌రుగ‌తోంది. ఈ గుహ నేప‌థ్యంలో వ‌చ్చే 20 నిమిషాల స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని డైరెక్ట‌ర్ ధీమాగా చెబుతున్నాడు. నిధి అన్వేష‌ణ‌తో పాటు వ‌ర్త‌మాన అంశాలతో ముడిప‌డిన క‌థ‌గా దీన్ని ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు తెర‌కెక్కిస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమాతో చైతూ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని తన ఖాతాలో వేసుకోవ‌డం గ్యారంటీగా క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.

Tags:    
  • NC24 
  • NagaChaitanya 
  • TreasureHunt 
  • KarthikDandu 
  • Tollywood 
  • NagaChaitanyaNC24 
  • AnnapurnaStudios 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS