నాగచైతన్య మిస్టిరీ థ్రిల్లర్.. పవర్ఫుల్ పోస్టర్ తో కిక్కిచ్చే అప్డేట్!

లేటెస్ట్ గా ఈ హీరో విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఓ మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తుండటం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.;

Update: 2025-07-04 06:33 GMT

తండేల్ హిట్ తర్వాత యూవసామ్రాట్ నాగ చైతన్య మంచి ఫాంలో ఉన్నాడు. లేటెస్ట్ గా ఈ హీరో విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఓ మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తుండటం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్‌వీసీసీ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి) బ్యానర్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాతలు కాగా, బాపినీడు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


ఇప్పటికే చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసింది. వచ్చిన రషెస్ చూసిన మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. ఇది చాల కీలకమైన షెడ్యూల్‌గా భావిస్తున్నారు. దీన్ని సుమారు నెల రోజుల పాటు ప్లాన్ చేశారు. ఇందులో నాగ చైతన్యతో పాటు ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చిన ప్రముఖ నటులు కూడా పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌లోని మూడు పెద్ద లొకేషన్లలో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య చేతిలో పిక్‌యాక్స్ మరియు జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్నాడు. “వన్ స్టెప్ డీపర్.. వన్ స్వింగ్ క్లోసర్” అన్న క్యాప్షన్ పోస్టర్‌కు ఆసక్తిని పెంచింది. కథలో నాగ చైతన్య పాత్ర ఎంతగా ట్రాన్స్‌ఫార్మ్ అయిందో తెలిసేలా ఈ లుక్‌ను డిజైన్ చేశారు.

ఇది చైతన్య కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోందని మేకర్స్ చెబుతున్నారు. మొదట విడుదలైన కాన్సెప్ట్ వీడియో NC24 ది ఎక్స్కవేషన్ బిగిన్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోలో ఈ సినిమా ఎంత గ్రాండ్‌గా తెరకెక్కుతోందో స్పష్టంగా కనిపించింది. మిస్టరీ, సస్పెన్స్, మైథాలజీ అంశాలు కలసి ఓ కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయనే బజ్ మార్కెట్‌లో ఉంది.

సాంకేతికంగా కూడా ఈ సినిమాకు చాలా బలమైన టీమ్ పని చేస్తోంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌గా రఘుల్ ధర్మన్ పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగాలా, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వరిస్తున్నారు. వీరి కాంబినేషన్‌తో సినిమా విజువల్స్ అద్భుతంగా ఉండనున్నాయనేది అంచనా.

మొత్తానికి నాగ చైతన్య - కార్తీక్ దండు కాంబినేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కలసి రూపొందిస్తున్న NC24 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించనప్పటికీ, మేకర్స్ ఇచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై క్రేజ్ పెంచుతోంది. ఇక త్వరలో టైటిల్, క్యాస్టింగ్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.

Tags:    

Similar News